How To Pay current Bill On TGSPDCL App :రాష్ట్ర ప్రజలకు ముఖ్య గమనిక. ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఈ నెల(జులై) నుంచి విద్యుత్ బిల్లుల చెల్లింపులను నిలిపేశారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ - టీజీఎస్‌పీడీసీఎల్ ఎక్స్(ట్విట్టర్) ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు జులై 1 నుంచి ఆయా సంస్థలు విద్యుత్ బిల్లుల చెల్లింపులను నిలిపివేసినట్లు వెల్లడించింది. ఇక నుంచి డిస్కం వెబ్‌సైట్ లేదా టీజీఎస్పీడీసీఎల్ మొబైల్ యాప్‌లో కరెంటు బిల్లులు చెల్లించాలని వినియోగదారులకు సూచించింది. మరి వాటి ద్వారా ఎలా పే చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
డిస్కం వెబ్‌సైట్ ద్వారా బిల్లులను ఎలా చెల్లించాలి:
- మొదట మీరు TSSPDCL అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
- ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Pay Bill online ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు మీరు 9 అంకెల యూఎస్‌సీ(USC -Unique Service Number) నెంబర్‌ను ఎంటర్ చేసి.. Submit బటన్పై క్లిక్ చేయాలి.
- స్క్రీన్ మీద వివరాలు కనిపిస్తాయి. వాటిని చెక్ చేసుకుని.. Current Month Bill సెక్షన్లో Click Here to Pay ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అప్పుడు మీకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో పేమెంట్ చేయడానికి రకరకాల ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.
- అందులో ఏదో ఒక దానిని సెలక్ట్ చేసుకోవాలి. ఉదాహరణకు.. T Wallet ద్వారా బిల్ పే చేయాలనుకుంటే T-Wallet ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- కొత్త విండో ఓపెన్ అవుతుంది. అందులో Postpaid ఆప్షన్‌పై క్లిక్ చేసి USC నెంబర్ ఎంటర్ చేసి Fetch Bill ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- వివరాలు అన్ని స్క్రీన్ మీద కనిపిస్తాయి. అవి వెరిఫై చేసుకుని Proceed to Pay ఆప్షన్‌పై క్లిక్ చేసి పేమెంట్ చేయాలి.
- అంతే ఇలా సింపుల్‌గా వెబ్‌సైట్ ద్వారా కరెంట్ బిల్లును చెల్లించవచ్చు.