తెలంగాణ

telangana

ETV Bharat / state

కరెంటు బిల్లు ఎలా కట్టాలని టెన్షన్​ పడుతున్నారా? - డోంట్​ వర్రీ - ఇలా చేస్తే చిటికెలో పేమెంట్​! - How to Pay Current Bill TGSPDCL App - HOW TO PAY CURRENT BILL TGSPDCL APP

Current Bill by App and Website: థర్డ్​ పార్టీ యాప్స్​ ద్వారా కరెంటు బిల్లులు చెల్లించవద్దని ఆర్​బీఐ గైడ్​లైన్స్​ పాస్​ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చాలా మంది కరెంటు బిల్లు ఎలా చెల్లించాలి అని ఆలోచిస్తున్నారు. మీరూ ఆ లిస్ట్​ లో ఉన్నారా? అయితే టెన్షన్​ అక్కర్లేదు. కేవలం ఈ ప్రాసెస్​ ద్వారా చిటికెలో పేమెంట్​ చేయవచ్చు.

CURRENT BILL PAYMENT ON TGSPDCL APP
How to Pay Current Bill by App and Website (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 9, 2024, 1:21 PM IST

How to Pay Current Bill by App and Website:ఒకప్పుడు కరెంట్ బిల్లు కట్టాలంటే విద్యుత్ కార్యాలయాలకు వెళ్లి కట్టేవాళ్లు. జనరేషన్​ మారడంతో.. ఆ తర్వాత ఆన్​లైన్, అనంతరం డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇక ఇటీవలే(జులై 1 నుంచి) థర్డ్​ పార్టీ పేమెంట్​ యాప్స్(ఫోన్‌ పే, పేటీఎం, అమెజాన్‌ పే, గూగుల్ పే)​ నుంచి విద్యుత్​ బిల్లుల చెల్లింపులను నిలిపివేశారు. ఈ క్రమంలోనే చాలా మంది కరెంటు బిల్లు ఎలా చెల్లించాలి అనే డైలమాలో పడ్డారు. మీరూ ఆ లిస్ట్​ లో ఉన్నారా? అయితే టెన్షన్​ అక్కర్లేదు. విద్యుత్​ బిల్లులను చెల్లించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ ఓ విధానాన్ని అమలుపరుస్తోంది. అదే TGSPDCL వెబ్​సైట్​ అండ్​ TGSPDCL మొబైల్​ యాప్​. మరి వీటి ద్వారా ఎలా పే చేయాలంటే..

TGSPDCL మొబైల్ యాప్‌ ద్వారా విద్యుత్‌ బిల్లును ఎలా చెల్లించాలి ?

  • మొదట గూగుల్‌ ప్లే స్టోర్‌ లేదా యాప్‌ స్టోర్‌ నుంచి TGSPDCL యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి.
  • యాప్​ ఓపెన్​ చేసిన తర్వాత రిజిస్టర్​ చేసుకోవాలి. అందుకోసం.. మీ 9 అంకెల యూఎస్‌సీ(USC) నెంబర్‌, పేరు, ఫోన్​ నెంబర్‌ ఎంటర్‌ చేసి.. Get OTP ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి.
  • మీ నెంబర్‌కు వచ్చిన OTP ఎంటర్‌ చేసి Register ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి.
  • ఇప్పుడు మీకు స్క్రీన్‌పైన కనిపిస్తున్న Pay Bill ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే.. వివరాలు వస్తాయి.
  • ఆ వివరాలను చెక్‌ చేసుకుని.. మెయిల్​ ఐడీ ఎంటర్​ చేసి Proceed to Pay ఆప్షన్​పై క్లిక్​ చేస్తే.. Pay With T-Wallet/ Bill Desk/Paytm అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో ఏదో ఒక పద్ధతి ఎంచుకోవాలి.
  • ఉదాహరణకు Bill Desk పై క్లిక్​ చేస్తే స్క్రీన్​ మీద మనం చెల్లించాల్సిన బిల్​ అమౌంట్​ డిస్​ప్లే అవుతుంది. అందులో Proceed to Pay ఆప్షన్​పై క్లిక్​ చేస్తే.. పేమెంట్​ ఆప్షన్​ కనిపిస్తాయి. అంటే క్రెడిట్​ కార్డ్​/ డెబిట్​ కార్డ్​/ఇంటర్నెట్​ బ్యాంకింగ్​/UPI యాప్స్​.. ఇలా కనిపిస్తాయి.
  • అందులో ఒకదాన్ని సెలెక్ట్​ చేసి Make a Payment ఆప్షన్​పై క్లిక్​ చేసి Proceed with Payment ఆప్షన్​పై క్లిక్​ చేసి పేమెంట్​ చేయవచ్చు.
  • అలాగే మీరు బిల్లు చెల్లించిన తర్వాత Bill Historyపై క్లిక్‌ చేసి.. పేమెంట్‌ వివరాలను చెక్‌ చేసుకోవచ్చు. ఇలా ఈజీగా యాప్‌ ద్వారా విద్యుత్‌ బిల్లులను చెల్లించుకోవచ్చు.

TGSPDCL వెబ్​సైట్​ వెబ్‌సైట్‌ ద్వారా బిల్లులను ఎలా చెల్లించాలి:

  • మొదట మీరు TSSPDCL అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయండి.
  • ఓ కొత్త పేజీ ఓపెన్​ అవుతుంది. అందులో Pay Bill online ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • ఇప్పుడు మీరు 9 అంకెల యూఎస్‌సీ(USC -Unique Service Number) నెంబర్‌ను ఎంటర్‌ చేసి.. Submit బటన్​పై క్లిక్​ చేయాలి.
  • స్క్రీన్​ మీద వివరాలు కనిపిస్తాయి. వాటిని చెక్​ చేసుకుని.. Current Month Bill సెక్షన్​లో Click Here to Pay ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • అప్పుడు మీకు కొత్త పేజీ ఓపెన్​ అవుతుంది. అందులో పేమెంట్​ చేయడానికి రకరకాల ఆప్షన్​లు అందుబాటులో ఉంటాయి.
  • అందులో ఏదో ఒక దానిని సెలక్ట్​ చేసుకోవాలి. ఉదాహరణకు.. T Wallet ద్వారా బిల్​ పే చేయాలనుకుంటే T-Wallet ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • కొత్త విండో ఓపెన్​ అవుతుంది. అందులో Postpaid ఆప్షన్​పై క్లిక్​ చేసి USC నెంబర్​ ఎంటర్​ చేసి Fetch Bill ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • వివరాలు అన్ని స్క్రీన్​ మీద కనిపిస్తాయి. అవి వెరిఫై చేసుకుని Proceed to Pay ఆప్షన్​పై క్లిక్​ చేసి పేమెంట్​ చేయాలి.
  • అంతే ఇలా సింపుల్‌గా వెబ్‌సైట్‌ ద్వారా కరెంట్‌ బిల్లును కట్టవచ్చు.

Mee Seva: ఒకవేళ యాప్​ లేదా వెబ్​సైట్​ ద్వారా కరెంట్​ బిల్​ పే చేయలేని వారు దగ్గరలోని మీ సేవా కేంద్రానికి వెళ్లి కూడా బిల్లు కట్టవచ్చు.

ఒక్క క్లిక్​తో కరెంట్ బిల్లు కట్టేయొచ్చు - ఈ QR కోడ్​ విధానం మీకోసమే?

TSSPDCL యాప్​ - కరెంట్ బిల్లు పేమెంట్సే కాదు - ఈ అప్లికేషన్​తో ఎన్ని లాభాలో తెలుసా? - TSSPDCL MOBILE APP PAY CURRENT BILL

ABOUT THE AUTHOR

...view details