How To Make A fish Trap With Plastic Bottle :సాధారణంగా చేపలు పట్టాలంటే చెరువుల్లో వల వేయడమో లేదంటే గాలం వేయడమో చేస్తుంటారు. అవన్నీ పాత పద్దతులు. కానీ వీటన్నింటికి భిన్నంగా ప్లాస్టిక్ బాటిల్‌తోనే చేపలు పట్టి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు యానాంలోని కొంతమంది. ఐడియా అద్దిరిపోయింది కదూ! అక్కడి వారు కొందరు ప్లాస్టిక్ బాటిల్‌తోనే చేపలు పట్టి ఓ కొత్త 'ఎర'వడికి శ్రీకారం చుట్టారు. ఈ విధంగా చేయడం వల్ల 2 కిలోల చేపలు కూడా దొరుకుతున్నాయని చెబుతున్నారు. చేపలను ప్లాస్టిక్ బాటిల్‌తో అంత ఈజీగా ఏవిధంగా పడుతున్నారు? ఏవైనా పదార్థాలను ఆ బాటిల్‌లో ఉపయోగిస్తున్నారా? లాంటి విషయాలను తెలుసుకుందాం.
చేపలు పట్టడంలో కొత్త ‘ఎర’వడి! :కేంద్ర పాలిత ప్రాంతమైనటువంటి యానాంలో కొంతమంది సులువుగా చేపలను పట్టేస్తున్నారు. ఇందుకోసం ప్లాస్టిక్ బాటిల్‌ను, మైదాపిండిని వాడుతున్నారు. ముందుగా ఓ ప్లాస్టిక్ సీసాను పైభాగం తొలగించి మిగిలిన దాంట్లో మైదాపిండి ముద్దను పెడుతున్నారు. ఆ బాటిల్‌ను నదిలోకి జారవిడుస్తున్నారు. సీసాలోని మైదాపిండిని తినేందుకు చేపలు అందులోకి వచ్చి అక్కడే చిక్కుకుంటూ వెనక్కి వెళ్లలేకపోతున్నాయి.