How to Book TTD Calendar 2025 Online: శ్రీవారి భక్తులకు శుభవార్త. 2025 సంవత్సరానికి సంబంధించి క్యాలెండర్లు, డైరీలను తిరుమల తిరుపతి దేవస్థానం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటి వరకు ఆఫ్‌లైన్‌లో, పోస్టల్ విధానం ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉండగా.. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి టీటీడీ క్యాలెండర్లు, డైరీలను పొందవచ్చు. 2025 ఏడాదికి సంబంధించి 12 పేజీలు, 6 పేజీలు, సింగిల్ షీట్, టేబుల్ టాప్ క్యాలెండర్లు అందుబాటులో ఉన్నాయి. మరి వాటిని ఎలా బుక్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
క్యాలెండర్ వివరాలు ఇవే:శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతి అమ్మవార్ల పెద్ద సైజు, శ్రీ పద్మావతి సమేతంగా శ్రీవారి ఫొటోతో క్యాలెండర్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు డీలక్స్ డైరీలు, చిన్న డైరీలను కూడా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. టీటీడీ క్యాలెండర్లు, డైరీలు కావాల్సిన వారు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.
ఈ ప్రాంతాల్లో కూడా:టీటీడీ ఎంపిక చేసిన ప్రాంతాల్లో అంటే.. తిరుమల, తిరుపతి, తిరుచానూరు, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, దిల్లీ, ముంబయి, వేలూరులోని ప్రముఖ బుక్ స్టోర్లు, ప్రధాన కళ్యాణ మండపాల్లో శ్రీవారి క్యాలెండర్లను నేరుగా కొనుగోలు చేయవచ్చు.
ధరలు ఇవే: పెద్ద డైరీ రూ.150 కాగా.. చిన్న డైరీ రూ.120కు లభిస్తుంది. 12 షీట్ క్యాలెండర్ రూ.130గా ఉంది. టేబుల్ క్యాలెండర్ రూ.75తో పాటు పోస్టల్ ఛార్జీలు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. మరి ఆన్‌లైన్‌లో క్యాలెండర్లు, డైరీలు ఎలా బుక్ చేసుకోవాలంటే..
అప్లికేషన్ ప్రాసెస్ ఇదే:
- మొదట https://ttdevasthanams.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
- హోమ్ పేజీలో More Services ఆప్షన్‌పై క్లిక్ చేస్తే పలు రకాలు సేవలు కనిపిస్తాయి. అందులో Diaries/Calendar/panchagam ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- ఇప్పుడు అందులో లాగిన్ వివరాలు ఎంటర్ చేయాలి. మీరు ఇంతకుముందే రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ వివరాలతో లాగిన్ అవ్వాలి. లేదంటే New User ఆప్షన్‌పై క్లిక్ చేసి కొత్తగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని ఆ వివరాలతో లాగిన్ అవ్వాలి.
- హోమ్‌పేజీలో Services ఆప్షన్లో పబ్లికేషన్స్‌లో Diaries/Calendar/panchagam పై క్లిక్ చేయాలి.
- అనంతరం మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న డైరీ లేదా క్యాలెండర్ ఆప్షన్లను ఎంపిక చేసుకోవాలి.
- మీరు భారత్‌లో నివసించే వారైతే.. ఐటెమ్ షిప్పింగ్ కోసం India ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ భారత నివాసి కాకపోతే.. ఇంటర్నేషనల్(International) ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.
- మీకు కావాల్సిన డైరీ లేదా క్యాలెండర్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అనంతరం మీకు ఎన్ని డైరీలు కావాలో ఆ నెంబర్ ఎంటర్ చేసి Proceed ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత మీ వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి. అనంతరం పూర్తి అడ్రస్ ఎంటర్ చేయాలి.
- అనంతరం మీరు ఎంపిక చేసుకున్న ఐటెమ్స్ ధర విత్ పోస్టల్ ఛార్జీస్ కలిపి ధర చూపెడుతుంది.
- తర్వాత ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వేను ఉపయోగించి.. డబ్బు చెల్లించాలి. అంతే ప్రాసెస్ పూర్తయ్యింది.
తిరుమల శ్రీవారి అధ్యయనోత్సవాలు - విశిష్టత ఇదే!
ఏడాదికి రెండు సార్లు కల్యాణోత్సవం- అభిషేకం లేని స్వామి- ద్వారక తిరుమల విశేషాలివే!
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్ - 10 రోజుల పాటు ఉచితంగా వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు - పూర్తి వివరాలివే!