తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒంటరి మహిళలకు నెలకు రూ. 2 వేల ఆర్థిక సాయం - ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా? - SINGLE WOMEN PENSION APPLY METHOD

ఆ స్కీమ్ ద్వారా ఒంటరి మహిళలకు అండగా నిలుస్తున్న తెలంగాణ సర్కార్ - అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్ ఇదే!

How to Apply for Single Women Pension
Single Women Pension in Telangana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

How to Apply for Single Women Pension in Telangana :కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడుగు, బలహీన వర్గాలకు, మహిళలకు అండగా నిలిచేందుకు వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటాయి. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం 2017 నుంచి నిరుపేద కుటుంబాలకు చెందని ఒంటరి మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు "సింగిల్​ ఉమెన్​" పెన్షన్ స్కీమ్​ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద ఒంటరి మహిళలకు నెలకు 2వేల 16 రూపాయలు అందిస్తోంది రాష్ట్ర సర్కార్. అయితే, ఈ సాయం పొందేందుకు ఎవరు అర్హులు? నిబంధనలేంటి? ఏవిధంగా అప్లై చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

సింగిల్ ఉమెన్ పింఛన్​కు ఎవరు అర్హులంటే?

  • వివాహిత : 18 సంవత్సరాలు నిండి వివాహం అయ్యాక భర్త నుంచి విడిపోయి వేరుగా ఉన్నవారు (కనీసం ఏడాది కాలానికి పైగా)
  • అవివాహిత : పెళ్లి చేసుకోని మహిళలు. గ్రామీణులైతే 30 సంవత్సరాలు, పట్టణ వాసులైతే 35 ఏళ్లు నిండి ఉండాలి.
  • కుటుంబ సంవత్సర ఆదాయం : గ్రామీణులైతే లక్షా 50 వేలు, పట్టణవాసులైతే రూ. 2 లక్షలకు మించకుండా ఉండాలి.
  • లబ్ధిదారులు గవర్నమెంట్ ఇతర పథకాల ద్వారా పింఛన్పొందరాదు.
  • అలాగే.. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ద్వారా పింఛన్ అందుకునే వారు ఈ స్కీమ్​కు అనర్హులు.
  • 57 సంవత్సరాలు నిండితే.. వృద్ధాప్య పింఛన్‌కు అర్హులు అవుతారు.
  • ఒకవేళ సదరు మహిళ పెళ్లి చేసుకున్నా.. శాశ్వాత ఉద్యోగం పొందినా.. ఈ పెన్షన్ రావడం ఆగిపోతుంది.

సింగిల్ ఉమెన్ పింఛన్​కు ఎలా అప్లై చేసుకోవాలంటే?

  • ఈ స్కీమ్ కింద పెన్షన్ పొందాలనుకుంటున్న ఒంటరి మహిళలు.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారైతే పంచాయతీ కార్యదర్శికి, పట్టణాల్లో ఉండే వారైతే బిల్ కలెక్టర్‌, GHMC పరిధిలోని వారైతే వీఆర్వోకు అప్లికేషన్ సమర్పించాలి.
  • ఈ అప్లికేషన్ ఫారాలను సదరు అధికారుల వద్ద నుంచి లేదా మీ సేవా కేంద్రాల నుంచి పొందవచ్చు.
  • అప్లికేషన్ ఫారమ్ తీసుకున్నాక అందులో పేర్కొన్న విషయాలను కరెక్ట్​గా నమోదు చేయాలి. ఆపై దానికి ఫొటో, వయస్సు ధ్రువీకరణ కోసం.. ఆధార్/ఓటరు కార్డు/బర్త్ సర్టిఫికెట్/పాఠశాల టీసీ వంటి వాటిలో ఏదో ఒకటి అటాచ్ చేయాల్సి ఉంటుంది.
  • అదేవిధంగా.. బ్యాంకు అకౌంట్ లేదా పోస్టాఫీస్ అకౌంట్ పాస్ బుక్ మొదటి పేజీ జీరాక్స్​, ఫుడ్ సెక్యూరిటీ కార్డు లేదా ఆధాయ ధ్రువీకరణ పత్రం జీరాక్స్ కాపీలను జత చేసి సంబంధిత అధికారులకు సబ్మిట్ చేయాలి.
  • అప్పుడు సంబంధిత అధికారులు అర్హులైన లబ్ధిదారులను గ్రామ లేదా వార్డు సభ ద్వారా సెలెక్ట్ చేస్తారు.
  • ఆ తర్వాత ఆయా అప్లికేషన్స్​ను మండల రెవెన్యూ అధికారి, పట్టణ ప్రాంతంలో మున్సిపల్ కమిషనర్ పరీక్షిస్తారు.
  • అనంతరం అర్హులైన మహిళలకు పింఛన్ సిఫారసు చేస్తూ.. ఆసరా వెబ్ సైట్లో అప్​లోడ్ చేస్తారు.
  • ఇక చివరగా.. ఆయా దరఖాస్తులను కలెక్టర్‌ పరిశీలనకు పంపి ఆమోదిస్తారు.

ABOUT THE AUTHOR

...view details