తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలా? - ఆన్​లైన్​లో సింపుల్​గా అప్లై చేసుకోండిలా! - NEW GAS CONNECTION APPLY

కొత్త గ్యాస్ కనెక్షన్ కోసం ఏజెన్సీకి వెళ్లాల్సిన పనిలేదు - ఈజీగా ఇలా అప్లై చేసుకోండి!

How to Apply for New Gas Connection
New Indane Gas Connection (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

How to Apply for New Indane Gas Connection :మీరు కొత్తగా ఇండేన్ వంటగ్యాస్(LPG) కనెక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే, అందుకోసం గతంలో మాదిరిగా ఏజెన్సీ వద్దకు వెళ్లి అక్కడ ఎక్కువ సమయం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నేటి టెక్నాలజీ యుగంలో అన్ని రంగాల మాదిరిగానే గ్యాస్ పంపిణీ సంస్థలు సేవలు సులభతం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మీరు ఉన్న చోటు నుంచే చాలా ఈజీగా కొత్త గ్యాస్ కనెక్షన్​కి అప్లై చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఇంతకీ, ఇండేన్ గ్యాస్ కొత్త కనెక్షన్ తీసుకోవడానికి కావాల్సిన పత్రాలేంటి? సింపుల్​గా ఎలా అప్లై చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అవసరమైన పత్రాలు :

  • ఆధార్కార్డు
  • ఓటర్ ఐడీ
  • పాస్​ పోర్ట్
  • విద్యుత్​/టెలిఫోన్/నీటి బిల్లు
  • ఇంటి రిజిస్ట్రేషన్ పత్రం
  • బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్ లేదా క్రెడిట్ కార్డ్స్టేట్‌మెంట్
  • డ్రైవింగ్ లైసెన్స్ వంటి వాటిలో ఏదో ఒకటి గుర్తింపు పత్రంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలంటే..

  • ఇందుకోసం ముందుగా మీ మొబైల్ లేదా కంప్యూటర్​లో ఇండేన్​ గ్యాస్ అధికార వెబ్​సైట్​ని సందర్శించాలి.
  • తర్వాత హోమ్ పేజీలో కనిపించే 'New Gas Connection' అనే లింక్​పై క్లిక్ చేయాలి.
  • అనంతరం ఓపెన్ అయిన అప్లికేషన్​ ఫారమ్​ను నింపాలి.
  • స్టేట్, పంపిణీదారు పేరు, మీ పేరు, పుట్టిన తేదీ, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ వంటి ముఖ్యమైన వివరాలన్నింటిని ఎంటర్ చేయాలి.
  • ఆ తర్వాత అక్కడ వచ్చిన క్యాప్చా కోడ్‌ను టైప్ చేసి 'Submit' బటన్​పై నొక్కాలి.
  • అనంతరం అవసరమైన KYC పత్రాలు, ఐడీ, అడ్రస్ ప్రూఫ్, మీ పాస్‌పోర్ట్ సైజు ఫొటోగ్రాఫ్‌లను అప్‌లోడ్ చేయాలి.
  • తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. అనంతరం మీ పత్రాలు ధృవీకరించబడతాయి.
  • అప్పుడు మీరు నమోదుచేసిన వివరాలన్నీ సరైనవి అయితే.. మీ అప్లికేషన్ ఆమోదించబడుతుంది. దాంతో మీకు ఇండేన్ గ్యాస్ కొత్త కనెక్షన్ వచ్చేస్తుంది.

ఆఫ్​లైన్ ద్వారా డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్‌లో ఇండేన్ గ్యాస్ కొత్త కనెక్షన్‌ కోసం ఎలా దరఖాస్తు చేయాలంటే..

  • ముందుగా మీ దగ్గరలోని ఇండేన్ LPG డిస్ట్రిబ్యూటర్ కార్యాలయానికి వెళ్లాలి.
  • ఒకవేళ మీకు తెలియకుంటే.. ఇండేన్ గ్యాస్ కస్టమర్ కేర్​కు కాల్ చేయడం ద్వారా కూడా సమీపంలోని కార్యాలయాన్ని తెలుసుకోవచ్చు.
  • ఆఫీసుకు వెళ్లిన తర్వాత అప్లికేషన్ ఫారమ్ ఇస్తారు.
  • అందులో మీ వ్యక్తిగత వివరాలను కరెక్ట్​గా నింపాలి. ఆపై దానికి ఐడీ, అడ్రస్ ప్రూఫ్ వంటి KYC పత్రాలను జత చేసి డిస్ట్రిబ్యూటర్​కి ఇవ్వాలి.
  • అదేవిధంగా, మీకు సబ్సిడీ వర్తిస్తే అందుకోసం రెండు ఫొటో కాపీలు, సబ్సిడీ ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలి.
  • ఫార్మాలిటీ కంప్లీట్ తర్వాత.. మీ గ్యాస్ డీలర్ కొత్త కనెక్షన్ విషయాన్ని ఫోన్ మెసేజ్ ద్వారా లేదా ఈ-మెయిల్ ద్వారా కన్ఫార్మ్ చేస్తారు.

ఇవీ చదవండి :

మీ గ్యాస్​ బర్నర్​ సరిగా మండట్లేదా? - సేఫ్టీ పిన్​​తో ఇలా చేస్తే - చిటికెలో ప్రాబ్లమ్ సాల్వ్!

గ్యాస్ సిలిండర్ కొద్ది రోజుల్లోనే ఖాళీ అవుతోందా? - ఈ టిప్స్ పాటిస్తే చాలా రోజులు వస్తుంది!

ABOUT THE AUTHOR

...view details