తెలంగాణలో కరవు - 'ఉపాధి'కి భరోసా కల్పించేది ఎలా? - drought Situation in Telangana - DROUGHT SITUATION IN TELANGANA
Employment Guarantee Scheme Issues in Telangana : రాష్ట్రంలో ఓవైపు తీవ్రమైన వర్షాభావం, కరవు పరిస్థితుల్లో గ్రామీణ ప్రజలందరిని కలవరపెడుతున్ అంశం ఉపాధి హమీ కింద దొరికే పని. ఇలాంటి సమయంలో పనులు దొరకకపోతే వారి జీవనోపాధికి భరోసాపై నేటి ప్రతిధ్వని.
Published : Apr 20, 2024, 9:47 AM IST
Prathidwani On Telangana Employment Guarantee Scheme :ఒకవైపు తీవ్రమైన వర్షాభావం మరోవైపు కమ్ముకొచ్చిన కరవు పరిస్థితుల్లో రాష్ట్రంలో ఇప్పుడు చాలామందిని కలవరపెడుతోన్న అంశం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి. జలాశయాలు నిండుకుంటూ, బోర్లు ఎండుతున్న తరుణంలో స్థానికంగా పనులు దొరక్కుంటే పల్లెప్రజల జీవనోపాధికి భరోసా ఎలా? ప్రత్యామ్నాయంగా కనిపిస్తోన్న జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఇప్పుడు సమర్థంగా ఉపయోగించుకోవడం ఎలా? వ్యవసాయం తర్వాత ప్రజలకు అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న ఈ పథకం అమలుకు ఎదురవుతున్న ప్రతికూలతలు ఏంటి? రానున్న రోజుల్లో ఉపాధి హామీకి భరోసా కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? ముఖ్యంగా కరవు పరిస్థితుల్లో ఉపాధి హామీ లాంటి పథకాలపై ఆధారపడ్డ ప్రజలకు ప్రత్యామ్నాయంగా పని కల్పించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఏయే రంగాలకు విస్తరించడం ద్వారా ప్రజలకు మెరుగైన రీతిలో ఉపాధి కల్పించవచ్చు? ఇదే నేటి ప్రతిధ్వని.