ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఊరెళ్తున్నాం - ఇంట్లో ఏమీ లేవు' - దొంగలకు షాకింగ్​ మెసెజ్​ - HOUSE OWNER WRITE LETTER TO THIEVES

మేము ఊరెళ్తున్నాం. బంగారం, డబ్బు తీసుకెళ్తున్నాం - మా ఇంటికి రాకండి - దొంగలకు ఓ ఇంటి యజమాని లేఖ

House Owner Write Letter to Thieves
House Owner Write Letter to Thieves (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 14, 2025, 5:35 PM IST

House Owner Write Letter to Thieves : దొంగతనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తమ కంటికి ఏది కనిపిస్తే దానిని చోరీ చేస్తున్నారు. ఇక ఇళ్లు, కార్యాలయాలు, దేవాలయాలకు తాళం కనిపించిదంటే చాలు చేతికి పని చెబుతున్నారు. జన సముహ ప్రాంతాలు, రద్దీ ప్రదేశాల్లో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కేటుగాళ్లు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. చటుక్కున అందినకాడికి దోచుకొని అక్కడినుంచి ఉడాయిస్తున్నారు. ఇక పండగల సమయం వస్తే వారికి అడ్డు అదుపూ ఉండదు.

తాజాగా సంక్రాంతి పండగ కోసం ప్రజలు సొంతూళ్ల బాట పట్టిన విషయం తెలిసిందే. ఇదే అదనుగా భావించి దొంగలు రెచ్చిపోతుంటారు. మరోవైపు ఇళ్లకు తాళాలు వేసినా ఇంట్లో ఉన్న వస్తువులపై యజమానులకు భయం ఉంటుంది. ఎక్కడ సొమ్ము, విలువైన వస్తువులు దొంగల పాలవుతాయనే అభద్రత భావం వారిలో ఉండక మానదు. ఓ ఇంటి యజమానికి కూడా ఈ సందేహం వచ్చినట్టుంది. ఈ క్రమంలో తన బుర్రకు పదునుపెట్టి తీరిగ్గా దొంగలకు ఓ లెటర్ రాశాడు. అది ఇప్పుడూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇంటి యజమాని రాసిన సందేశం (ETV Bharat)

‘మేము సంక్రాంతికి ఇంటికి పోతున్నాం. డబ్బు, నగలూ తీసుకుని వెళ్తున్నాం. మా ఇంటికి రాకండి.- ఇట్లు మీ శ్రేయోభిలాషి’’ అంటూ పేపర్‌పై రాసి ఆ ఇంటి యజమాని డోర్‌కు అంటించి మరీ వెళ్లాడు. ఈ దృశ్యం సోషల్ మీడియాకి చిక్కింది. ఇది కాస్తా వైరల్‌గా మారింది. దొంగలకే షాక్ ఇస్తూ ఓ ఇంటి యజమాని ఈ రకంగా సందేశం పెట్టడం అందరినీ ఆకర్షించింది. ఈయనెవరో దొంగలకే లెటర్ రాశారంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.

ఆలయంలో చోరీ - దొంగల్ని పట్టించిన దేవుడు!

గతంలో ట్రాన్సుపోర్టు అధికారి ఇప్పుడు దొంగ - ₹40లక్షలు చోరీ 42 గంటల్లోపే!

ABOUT THE AUTHOR

...view details