Hospitals Letter About Aarogyasri Pending Payments: మే 22 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వానికి నెట్వర్క్ ఆస్పత్రుల సంఘం లేఖ రాసింది. పెండింగ్ బిల్లులు చెల్లించక పోవడంపై ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈఓ లక్ష్మీషాకు ఏపీ స్పెషాల్టీ ఆస్పత్రుల అసోసియేషన్ లేఖ రాసింది. ఈ నెల 22వ తేదీ నుంచి ఏపీలోని వివిధ ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆస్పత్రులు సంఘం ఆరోగ్య శ్రీ సేవలు నిలిపేస్తామని పేర్కొంది. 2023 ఆగస్టు నుంచి ఉన్న 1500 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు చెల్లించాలని వినతి చేస్తోంది. సుదీర్ఘ కాలంగా బిల్లులు పెండింగ్లో ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలపాల్సి వస్తుందని ఆస్పత్రులు సంఘం పేర్కొంది. పలుమార్లు లేఖలు రాసినా ఇప్పటి వరకూ 50 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లింపులు చేశారని ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ పేర్కొంది.
22 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత - ప్రభుత్వానికి నెట్వర్క్ ఆస్పత్రుల సంఘం లేఖ - Hospitals letter About Aarogyasri
Hospitals Letter About Aarogyasri Pending Payments: ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నామంటూ ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ పేర్కొంది. ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈవో లక్ష్మీషాకు నెట్వర్క్ ఆస్పత్రుల సంఘం లేఖ రాసింది. ఈ నెల 22 నుంచి ఏపీలోని వివిధ ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపేస్తామని వెల్లడించింది. సుదీర్ఘ కాలంగా బిల్లులు పెండింగ్లో ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో సేవలు నిలిపివేస్తున్నామని లేఖ తెలిపింది.
Aarogyasri Pending Payments (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 20, 2024, 7:03 PM IST