ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధర్మవరంలో ఉద్రికత్త - బీజేపీ కార్యకర్తపై కారును ఎక్కించిన కేతిరెడ్డి వర్గీయులు - High Tension in Dharmavaram - HIGH TENSION IN DHARMAVARAM

Tension in Dharmavaram Sub Jail : ధర్మవరంలో బీజేపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ధర్మవరం సబ్‌జైలులో ఖైదీ పరామర్శకు కేతిరెడ్డి వచ్చారు. అప్పుడు అటువైపు వస్తున్న బీజేపీ నేత హరీశ్​ వాహనశ్రేణికి అడ్డుగా కేతిరెడ్డి శ్రేణులు వాహనాలు అడ్డుగా పెట్టారు. ఈ విషయంపై మాటా మాటా పెరిగి గొడవకు దారి తీసింది. సమాచారం అందుకున్న పోలీసులు వారికి సర్దిచేప్పేందుకు యత్నిస్తున్నారు.

High Tension in Dharmavaram
High Tension in Dharmavaram (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 23, 2024, 7:56 PM IST

Updated : Sep 23, 2024, 8:12 PM IST

Clash Between YSRCP and BJP Leaders Dharmavaram : సత్యసాయి జిల్లా ధర్మవరం సబ్ జైలు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్సార్సీపీ, బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వాదం నెలకొంది. కమలం పార్టీ నేత హరీశ్ తన అనుచరులతో ఆ రోడ్డు మార్గాన వస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వర్గీయులు ఆ రహదారిలో వాహనాలను అడ్డుగా పెట్టారు. ఈ నేపథ్యంలోనే వాహనాలు అడ్డు తొలగించాలని కమలం కార్యకర్తలు వారిని కోరారు.

ఈ విషయం కాస్తా ఘర్షణకు దారి తీసింది. ఈ నేపథ్యంలోనే కేతిరెడ్డి వెంట్రామిరెడ్డి డ్రైవర్‌ను హరీశ్‌ వర్గీయులు చితకబాదారు. కేతిరెడ్డి దురుసుగా వ్యవహరించారని వారు ఆరోపించారు. ఈ క్రమంలోనే బీజేపీ కార్యకర్త ప్రతాపరెడ్డి కేతిరెడ్డి వర్గీయులను అడ్డుకునేందుకు యత్నించారు. ప్రతాపరెడ్డిపై వాహనాన్ని ఎక్కించడంతో ఒక్కసారిగా ఎగిరి కింద పడ్డారు. ధర్మవరం సబ్‌జైలులో ఖైదీ పరామర్శకు కేతిరెడ్డి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ప్రజలు భయాందోళనలకు లోనయ్యారు.

EX MLA Kethireddy VS Harish :ఈ విషయం తెలుసుకున్న కూటమి నాయకులు, కార్యకర్తలు జైలు వద్దకు చేరుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వారి మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్కడి నుంచి వారంతా ధర్మవరం పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు . ఇరువర్గాల ఘర్షణతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే పుట్టపర్తి నుంచి అదనపు బలగాలు ధర్మవరానికి రప్పించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని జిల్లా నుంచి బహిష్కరించాలి : మరోవైపు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని జిల్లా నుంచి బహిష్కరించాలని కూటమి నేతలు పేర్కొన్నారు. ఆయన రౌడీలను వెంటేసుకుని శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆరోపించారు. ధర్మవరంలో అరాచకాలు చేసిన కేతిరెడ్డిని ప్రజలు ఓడించారని చెప్పారు. ఆ ఓటమి జీర్ణించుకోలేక గుండాలను వెంట బెట్టుకొని దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు. ఇవాళ జరిగిన ఘటనపై పోలీసులు దర్యాప్తు జరిపి కేతిరెడ్డిని కఠినంగా శిక్షించాలన్నారు.

తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం - అడిషనల్ ఎస్పీపై రెచ్చిపోయిన కేతిరెడ్డి పెద్దారెడ్డి - Pedda Reddy Comments On Police

బూతులతో విరుచుకుపడ్డ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి- బీజేపీ అభ్యర్థిపై వ్యక్తిగత దూషణలు - Ketireddy Controversial Comments

Last Updated : Sep 23, 2024, 8:12 PM IST

ABOUT THE AUTHOR

...view details