Joint Chittoor district Elections 2024:ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. చిత్తూరులో టీడీపీ అభ్యర్థి జగన్మోహన్ అనుచరుడు పవన్‌పై వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయానందరెడ్డి అనుచరులు రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన తీవ్ర గాయాలపాలైన జగన్మోహన్ అనుచరుడు పవన్‌ను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద ఉన్న 78, 80 పోలింగ్ కేంద్రాలలో తెలుగుదేశం ఏజెంట్‌పై వైఎస్సార్సీపీ ఏజెంట్ దాడి చేశాడు. దాడి చేసిన ఏజెంట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కాసేపటికి వదిలి పెట్టారు. దీంతో అతడు మళ్లీ పోలింగ్ కేంద్రంలోకి రావటంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన వాడిపై చర్యలు తీసుకోకుండా పోలింగ్ బూత్‌లోకి ఎలా పంపుతారంటూ పోలీసులను నిలదీశారు. టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ అక్కడికి చేరుకొని ఆందోళన చేపట్టారు. పోలీసులు ఏకపక్షంగా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహారిస్తున్నారని ఆరోపించారు. దాడికి పాల్పడిన వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలలోని పలు కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. ననియాల 80వ బూత్ సమీపంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి భరత్ తన అనుచరులతో టీడీపీ శ్రేణులపై దాడికి పాల్పడ్డారు. పోలింగ్ కేంద్రాల్లోకి భరత్ తన అనుచరులతో కలిసి ప్రవేశించడాన్ని తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకున్నారు. సింగసముద్రంలో పోలింగ్ బూత్‌లోకి వెళ్లిన భరత్ తలుపులు మూసివేయటంతో టీడీపీ శ్రేణులు నిరసనకు దిగారు. భరత్ తన అనుచరులతో భీభత్సం సృష్టిస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
శాంతిభద్రతలు కాపాడలేకపోయారు - హింసాత్మక ఘటనలపై చంద్రబాబు ఆగ్రహం - Chandrababu on Clashes in Palnadu