CM Chandrababu Congrats to Balakrishna: కళల విభాగంలో పద్మభూషణ్ పురస్కారం పొందిన తెలుగు సినీ దిగ్గజం మరియు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ ద్వారా హృదయ పూర్వక అభినందనలు తెలియజేశారు. లెజెండరీ ఎన్టీఆర్ వారసత్వాన్ని నిలబెడుతూ సినిమా, రాజకీయాలు మరియు దాతృత్వంలో రాణించారన్నారు. ప్రజా సంక్షేమానికి ప్రత్యేకించి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా మీ అంకితభావాన్ని లెక్కలేనన్ని జీవితాలను తాకిందని మరియు లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చిందని కొనియాడారు. ఇది నిజమైన ఐకాన్ మరియు దయగల నాయకుడికి దక్కిన గౌరవమని చంద్రబాబు అన్నారు.
ఎన్టీఆర్ నట వారసుడిగా బాలకృష్ణ సినీ రంగంలో అడుగుపెట్టారు. 30 ఏళ్లుగా సినీ రంగానికి విశేష సేవలు అందిస్తున్నారు. 1960 జూన్ 10న నందమూరి బాలకృష్ణ జన్మించారు. ఎన్టీఆర్, బసవ రామతారకం దంపతుల ఆరో కుమారుడు బాలకృష్ణ. నటుడిగా, రాజకీయ నాయకుడిగా బాలకృష్ణ సేవలందిస్తున్నారు. బసవతారకం క్యాన్సర్స్ ఆస్పత్రి ఛైర్మన్‌గా సేవలందిస్తున్నారు.
తాతమ్మ కల(1974) చిత్రంతో బాలకృష్ణ సినీరంగ ప్రవేశం చేశారు. 14 ఏళ్ల వయస్సులోనే తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి బాలకృష్ణ నటించారు. 'సాహసమే జీవితం' చిత్రంతో హీరోగా బాలకృష్ణ పరిచయమయ్యారు. ఇప్పటి వరకు బాలకృష్ణ 109 చిత్రాల్లో నటించారు. చారిత్రక, జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాలతో బాలకృష్ణ ఇప్పటికీ అలరిస్తున్నారు. బాలకృష్ణ హిందూపురం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
Heartfelt congratulations to Telugu cinema legend and Hindupur MLA, Shri Nandamuri Balakrishna Garu, on being conferred the Padma Bhushan! Upholding the legendary NTR Garu’s legacy, you have excelled in cinema, politics, and philanthropy. Your dedication to public welfare,… pic.twitter.com/rC4HEABLmN
— N Chandrababu Naidu (@ncbn) January 25, 2025
బాలయ్య మావయ్యకు అభినందనలు: పద్మభూషణ్‌కు ఎంపికైన బాలకృష్ణకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. బాలయ్య మావయ్యకు పురస్కారం రావడం తమ కుటుంబానికి చాలా గర్వకారణమని లోకేశ్ పేర్కొన్నారు. బాలకృష్ణ ప్రయాణం లక్షలాదిమందికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. సినీ, రాజకీయాల్లో బాలకృష్ణ కృషికి ఈ పురస్కారం నిదర్శనమన్నారు. బాలకృష్ణ విజయాలకు గుర్తింపురావడం సంతోషంగా ఉందని లోకేశ్ ట్వీట్ చేశారు.
Super proud moment for our family! Huge congratulations to my Bala Mavayya on being awarded the prestigious Padma Bhushan! Your legendary journey, from blockbuster hits to inspiring millions, is a testament to your remarkable contributions to cinema, politics, and healthcare.… pic.twitter.com/SlrhAjFTnb
— Lokesh Nara (@naralokesh) January 25, 2025
జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు: పద్మభూషణ్ పురస్కారం పొందిన బాలకృష్ణకు సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ శుభాకాంక్షలు తెలిపారు. సినీ రంగానికి బాలయ్య బాబాయి చేసిన సేవ అసమానమైనదని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. మీ నిర్విరామ కృషి, ప్రజాసేవకు ఈ అవార్డు నిదర్శనమని జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ ద్వారా తెలిపారు.
Heartiest congratulations to Bala Babai on being honored with the prestigious Padma Bhushan award. This recognition is a testament to your unparalleled contributions to cinema and your relentless public service.
— Jr NTR (@tarak9999) January 25, 2025
Heartfelt congratulations to my Babai Nandamuri Balakrishna garu on receiving the prestigious Padma Bhushan award. This honor is a true recognition of your exceptional contributions to the world of cinema and your relentless efforts in serving society.
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) January 25, 2025
డి.నాగేశ్వర్‌రెడ్డికి చంద్రబాబు అభినందనలు: మరోవైపు పద్మవిభూషణ్ పొందిన తెలంగాణకు చెందిన ప్రఖ్యాత వైద్యుడు డి.నాగేశ్వర్‌రెడ్డికి సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. డి.నాగేశ్వర్‌రెడ్డి వైద్యరంగంలో విశేష కృషి చేశారని, దేశానికి, తెలుగుసమాజానికి గౌరవం తెచ్చారని కొనియాడారు. నాగేశ్వర్‌రెడ్డి విజయపరంపర ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.
Congratulations to the renowned gastroenterologist, and Chairman and founder of @AIGHospitals, Dr D Nageshwar Reddy Garu, on being conferred the Padma Vibhushan award. Your remarkable contributions to medicine have brought immense pride to the nation, especially the Telugu… pic.twitter.com/8HCc9N84R1
— N Chandrababu Naidu (@ncbn) January 25, 2025
భారత అథ్లెట్లకు పురస్కారాలు- శ్రీజేశ్కు పద్మ భూషణ్, అశ్విన్‌కు పద్మ శ్రీ