తెలంగాణ

telangana

ETV Bharat / state

నిప్పుల కొలిమిలా తెలంగాణ - 11 గంటల నుంచి 4:30 గంటల వరకు అస్సలు బయటకు రాకండి - High temperature in Telangana - HIGH TEMPERATURE IN TELANGANA

High temperature in Telangana : రాష్ట్రంపై ప్రచండ భానుడు నిప్పులు చెరిగాడు. భానుడి భగభగలకు జీవజాతులు అల్లాడిపోయాయి. ఒక వైపు అధిక ఉష్ణోగ్రతలు, మరోవైపు వడగాల్పులతో జనం బెంబేలెత్తిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గరిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెల్లపాడు, నల్గొండ జిల్లా నాంపల్లిలో అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 44.5 ఉష్ణోగ్రతలు రికార్డుగా చెప్పుకోవచ్చు.

High temperature in Telangana
High temperature in Telangana

By ETV Bharat Telangana Team

Published : Apr 7, 2024, 9:52 AM IST

వాతవరణశాఖ కీలక అప్​డేట్- నేడు, రేపు ఈదురుగాలులు, వర్షాలు పడే అవకాశం

High temperature in Telangana :భానుడి ఉగ్రరూపానికి రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు (High Temparature) 42 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. తీవ్రమైన వడగాల్పుల (Heat waves) ప్రభావానికి జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఎండ వేడిమి తీవ్రంగా ఇబ్బందులు పెట్టింది.

సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత :ఉదయం 9 గంటల నుంచే అన్ని ప్రాంతాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు(Temperatures) నమోదయ్యాయి. శనివారం అత్యధికంగా సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌లో 44.5, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెల్లపాడు 44.5 డిగ్రీలు, నల్గొండ జిల్లా నాంపల్లి 44.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎల్కపల్లి 44.4, ములుగు జిల్లా మేడారం 44.4, మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ 44.4, మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లా పమ్మిలో 44.3, వనపర్తి జిల్లా కన్నాయిపల్లి 44.3, జగిత్యాల జిల్లా కల్వాయి 44.1, కరీంనగర్ జిల్లా వీణవంక 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతేడాది ఏప్రిల్‌ 6న ఒకటి రెండు చోట్ల 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది అన్ని జిల్లాల్లో 42 డిగ్రీలు దాటి అత్యధికంగా 44.5గా నమోదయ్యాయని చెప్పుకోవచ్చు.

IMD Issues Alert on Heat waves :ఏప్రిల్‌ ప్రథమార్థంలోనే ఎండల తీవ్రత ఇలా ఉంటే, ఈ మాసం చివరితో పాటు మే నెలలో పరిస్థితి ఏవిధంగా ఉంటుందోనని ప్రజలు జంకుతున్నారు. మే నెలలో ఉష్ణోగ్రతలు 48 నుంచి 49 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎండలకు తోడు వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. గత రెండు రోజులుగా రాష్ట్రంలో తీవ్రమైన వడగాల్పులు వీచాయి. వృద్ధులు, చిన్న పిల్లలపై ఉష్ణోగ్రతలు, వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంది.

ఆ సమయంలో బయటకు రావద్దు :ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు బయటకు రావొద్దని వాతావరణ శాఖ (Indian Metrological Department) హెచ్చరించింది. అత్యవసర పరిస్థితుల్లో రావాల్సి వస్తే, తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 2015, 16 సంవత్సరాల్లో కూడా ఎండలు దంచికొట్టాయి. ఆ రెండు సంవత్సరాల్లో ఎండల తీవ్రతకు అనేక మంది మృత్యువాతపడ్డారు. అలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం (Government) సైతం ప్రజలను హెచ్చరిస్తోంది.

4 రోజుల పాటు వర్షాలు!:ఎండలతో అల్లాడిపోతున్న ప్రజానీకానికి వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు (Rains) కురుస్తాయని ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

రాష్ట్రంలో పట్టపగలే చుక్కలు చూపిస్తోన్న సూరీడు - గడప దాటేందుకు జంకుతున్న ప్రజలు - Temperatures Rises in Telangana

రాష్ట్రంలో సుర్రుమంటున్న సూరీడు - ఇది శాంపిల్​ మాత్రమే, ఈ నెలాఖరులో భానుడి ఉగ్రరూపం! - Temparatures Rising in Telangana

నిప్పుల కొలిమిలా రాష్ట్రం.. గరిష్ఠంగా 46 డిగ్రీల ఎండ..!

ABOUT THE AUTHOR

...view details