తెలంగాణ

telangana

ETV Bharat / state

సాయంలోనూ 'బాహుబలి' - తెలుగు రాష్ట్రాలకు ప్రభాస్ భారీ విరాళం - Prabhas Dontaion to Telugu States - PRABHAS DONTAION TO TELUGU STATES

Hero Prabhas Donation To Telangana : పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్ తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించారు. దాంతోపాటు వరదలకు గురైన ప్రాంతంలో ప్రజలకు భోజనాలు, నీళ్లు ఏర్పాటు చేసి తన పెద్ద మనసు చాటుకున్నారు.

Hero Prabhas Donation To Telugu States
Hero Prabhas Donation To Telugu States (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 4, 2024, 12:49 PM IST

Updated : Sep 4, 2024, 3:08 PM IST

Hero Prabhas Donation To Telugu States :ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రజలు సర్వం కోల్పోయి రోడ్లపై పడ్డారు. ప్రభుత్వం సహాయక చర్యల్లో నిమగ్నమైపోయింది. వాటిల్లిన నష్టానికి సెలబ్రిటీలు ముందుకు వచ్చి ఆప్పన్నహస్తం అందిస్తున్నారు. తాజాగా పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​ తెలుగు రాష్ట్రాలను భారీ విరాళం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు రూ.2 కోట్ల విరాళాన్ని ఇచ్చారు.

Nagarjuna Flood Donations : మరోవైపు తెలుగు రాష్ట్రాలకు రూ.50 లక్షల చొప్పున అక్కినేని కుటుంబం విరాళం ప్రకటించింది. ఒక్కో రాష్ట్రానికి రూ.50 లక్షల చొప్పున ఏపీ, తెలంగాణ వరద సహాయ కార్యక్రమాలకు రూ.కోటి విరాళం అందిస్తున్నట్లు అక్కినేని నాగార్జున తెలిపారు. ప్రజలకు తక్షణ సాయం చేరాలని కోరుకుంటున్నామని అన్నారు. బాధిత ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నట్లు చెప్పారు.

Last Updated : Sep 4, 2024, 3:08 PM IST

ABOUT THE AUTHOR

...view details