తెలంగాణ

telangana

ETV Bharat / state

సొంతూళ్ల బాట పట్టిన ఆంధ్రా ఓటర్లు - హైదరాబాద్- విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ - TRAFFIC AT HYD VIJAYAWADA HIGHWAY - TRAFFIC AT HYD VIJAYAWADA HIGHWAY

Traffic Jam in Vijayawada Highway : ప్రజాస్వామ్య పండుగకి హైదరాబాద్‌ వాసులు తరలివెళ్తుండటంతో రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. వాహనాల రద్దీతో రోడ్లు జనజాతరను తలపిస్తున్నాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది . ఓ వైపు ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, కోదాడ వంటి ప్రాంతాలకు వెళ్లే వారు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు, వీటితో పాటు సొంత వాహనాల్లో స్వగ్రామాలకు వెళ్లే వారితో రద్దీగా మారింది.

Traffic Jam in Vijayawada Highway
Traffic Jam in Vijayawada Highway (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 12, 2024, 7:14 AM IST

Updated : May 12, 2024, 2:02 PM IST

పంతంగి టోల్​ప్లాజా వద్ద వాహనాల రద్దీ (ETV Bharat)

Heavy Traffic Jam on Vijayawada Highway Today :రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు రావడంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్‌లో ఉంటున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు సొంతూళ్లకు పయనమయ్యారు. తమ అభిమాన నేతలను గెలిపించుకునేందుకు కుటుంబాలతో సహా బయలుదేరారు. పెద్దసంఖ్యలో జనం తరలివెళ్తుండటంతో రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు జనంతో కిక్కిరిసిపోయాయి. చాలామంది సొంత వాహనాల్లో బయల్దేరడంతో రహదారులు, టోల్‌ప్లాజాల వద్ద రద్దీ నెలకొంది.

Traffic Jam At LB Nagar in Hyderabad : ఈ క్రమంలోనే ఎల్బీనగర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది. దీంతో విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాల రద్దీ నెలకొంది. ఎల్బీనగర్ నుంచి పనామా వరకు వాహనాలు నెమ్మదిగా సాగాయి. ఓటర్లు ఏపీతో పాటు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట వైపు వెళ్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు విజయవాడ హైవేపై ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తున్నారు.

AP Voters Going From Hyderabad :అలాగే రామచంద్రాపురం, బీరంగూడ, అశోక్‌నగర్, బొల్లారం ప్రాంతాల నుంచి ఓటర్లు ఓటువేసేందుకు తమ ఊళ్లకు తరలివెళ్తున్నారు. ఎల్బీనగర్‌, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మియాపూర్, మదీనాగుడ, చందానగర్ ప్రాంతాల్లో బస్సుల కోసం ప్రయాణికులు గంటలకొద్ది పడిగాపులు కాస్తున్నారు. బస్సుల్లో సీట్లు దొరడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ బస్సులైతే ఏకంగా 3 రెట్లు ఎక్కువగా వసూలు చేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. మరోవైపు ఎన్ని ఇబ్బందులు పడినా స్వస్థలాలకు వెళ్లి ఓటుహక్కును వినియోగించుకొని, తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకుంటామని పలువురు తెలిపారు.

మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లాలోని పంతంగి టోల్‌ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. గత రెండు రోజుల నుంచి భారీగా వాహనాలు ఏపీకి వెళ్తున్నాయి. దీంతో టోల్ ప్లాజా సిబ్బంది 16 టోల్‌ చెల్లింపు కేంద్రాలకు గాను, విజయవాడ వైపు 9 గేట్లను తెరిచారు. దాదాపు 95 శాతం వాహనాలు ఇప్పటికే ఫాస్టాగ్‌ ఏర్పాటు చేసుకోవడంతో నిమిషాల వ్యవధిలోనే టోల్ గేట్ల నుంచి బయటకు వెళ్లిపోతున్నాయి

ప్రయాణీకుల రద్దీతో కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు- 2 వేల ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ - Heavy Rush At Bus stations

Last Updated : May 12, 2024, 2:02 PM IST

ABOUT THE AUTHOR

...view details