Heavy Rush Of devotees in Tirumala :ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు భక్తులతో నిండిపోయాయి. రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు భారీ ఎత్తున బారులు తీరారు. వీరికి శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. దీంతో క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు అందిస్తున్నారు. ఈ రద్దీ వారాంతం వరకు కొనసాగే అవకాశం ఉంది.
VIP Break Darshans on weekends are cancelled :తిరుమలకు ఒక్కసారిగా భక్తుల తాకిడి పెరిగింది. వేసవి సెలవులు ముగియనుండటం, ఎన్నికల ప్రక్రియ పూర్తవ్వడం, విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదలైన నేపథ్యంలో తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ముఖ్యంగా శుక్ర, శనివారాల్లో సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకోవాలంటే సుమారు 30-40 గంటల సమయం క్యూలైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో సామాన్య భక్తుల కోసం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.