తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Jul 21, 2024, 2:24 PM IST

Updated : Jul 21, 2024, 9:38 PM IST

ETV Bharat / state

LIVE UPDATES : రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు - పెరుగుతున్న గోదావరి నీటిమట్టం - TELANGANA RAINS LIVE UPDATES

Rains live updates
Rains live updates (ETV Bharat)

గత మూడు రోజులుగా తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలో వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. ఆయా జిల్లాలో వరద ఉద్ధృతికి రోడ్లు కొట్టుకుపోయాయి. ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. నేడు అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కరిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తాజాగా ఈ జిల్లాలకు ఐఎండీ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

LIVE FEED

9:36 PM, 21 Jul 2024 (IST)

  • భద్రాచలం వద్ద మెుదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు
  • భద్రాచలం వద్ద 44 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
  • నీటిమట్టం 43 అడుగులు దాటడంతో మెుదటి ప్రమాద హెచ్చరిక జారీ
  • లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన అధికారులు
  • లోతట్టు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని అధికారుల సూచన
  • మత్స్యకారులు గోదావరి వద్దకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిక
  • భారీ వర్షాలు కురుస్తున్నందున గోదావరి నీటిమట్టం పెరిగే అవకాశం

9:36 PM, 21 Jul 2024 (IST)

  • రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
  • ములుగు జిల్లా ఏటూరునాగారంలో 12 సెం.మీ వర్షపాతం
  • హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో 8.03 సెం.మీ వర్షపాతం
  • కరీంనగర్‌ జిల్లా బోర్నపల్లిలో 6.09 సెం.మీ వర్షపాతం
  • భద్రాద్రి జిల్లా సత్యనారాయణపురంలో 6.03 సెం.మీ వర్షపాతం
  • పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 5.08 సెం.మీ వర్షపాతం

8:32 PM, 21 Jul 2024 (IST)

  • నిర్మల్​ జిల్లాలోని కడెం జలాశయానికి పెరుగుతున్న వరద ప్రవాహం
  • కడెం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 690.60 అడుగులు
  • కడెం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు
  • కడెం జలాశయం 3 గేట్లు ఎత్తి 14,000 క్యూసెక్కులు విడుదల

8:16 PM, 21 Jul 2024 (IST)

  • భద్రాచలం వద్ద మెుదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు
  • భద్రాచలం వద్ద 43.6 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
  • నీటిమట్టం 43.6 అడుగులకు చేరడంతో మెుదటి ప్రమాద హెచ్చరిక జారీ
  • లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన అధికారులు
  • లోతట్టు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని అధికారుల సూచన
  • మత్స్యకారులు గోదావరి వద్దకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిక
  • భారీ వర్షాలు కురుస్తున్నందున గోదావరి నీటిమట్టం పెరిగే అవకాశం

8:15 PM, 21 Jul 2024 (IST)

  • భద్రాచలం నుంచి ఏపీలోని విలీన మండలాలకు నిలిచిన రాకపోకలు
  • మురుమూరు వద్ద రహదారిపైకి వరద రావడంతో నిలిచిన రాకపోకలు
  • కూనవరం, వీఆర్‌పురం మండలంలోని గ్రామాలకు నిలిచిన రాకపోకలు
  • చింతూరు, ఎట్టపాక మండలంలోని గ్రామాలకు నిలిచిన రాకపోకలు

7:11 PM, 21 Jul 2024 (IST)

  • భద్రాచలం వద్ద మెుదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు
  • భద్రాచలం వద్ద 43 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
  • నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
  • లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన అధికారులు
  • మత్స్యకారులు గోదావరి వద్దకు వెళ్లవద్దని అధికారుల హెచ్చరిక
  • భారీ వర్షాలు కురుస్తున్నందున గోదావరి నీటిమట్టం పెరిగే అవకాశం

7:11 PM, 21 Jul 2024 (IST)

  • భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ఉభయ నదులు ఉగ్రరూపం
  • భారీ వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి, ప్రాణహిత
  • త్రివేణి సంగమం వద్ద పుష్కరఘాట్లను తాకుతున్న ప్రవాహం

6:57 PM, 21 Jul 2024 (IST)

  • భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీకి భారీగా పెరుగుతున్న వరద
  • ఇవాళ మేడిగడ్డ బ్యారేజీకి వచ్చిన 5.52 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
  • 85 గేట్లు ఎత్తి 5.52 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల
  • అన్నారం బ్యారేజీ నుంచి 66 గేట్లు ఎత్తి 16,850 క్యూసెక్కులు విడుదల

6:37 PM, 21 Jul 2024 (IST)

  • శ్రీశైలం జలాశయానికి క్రమంగా పెరుగుతున్న వరద
  • జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 1.14 లక్షల క్యూసెక్కుల వరద
  • శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు
  • శ్రీశైలంలో ప్రస్తుత నీటి మట్టం 822.5 అడుగులు
  • శ్రీశైలం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు
  • శ్రీశైలంలో ప్రస్తుత నీటి నిల్వ 42.73 టీఎంసీలు

6:20 PM, 21 Jul 2024 (IST)

  • భద్రాచలం వద్ద క్రమక్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
  • సాయంత్రం 6 గం.కు 42.05 అడుగులకు చేరిన నీటిమట్టం
  • నీటిమట్టం 43 అడుగులకు చేరితే మెుదటి ప్రమాద హెచ్చరిక జారీ
  • లోతట్టు ప్రాంత ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించిన అధికారులు

6:20 PM, 21 Jul 2024 (IST)

  • భద్రాద్రిలోని గుండాల-కొడవటంచ మార్గంలో పొంగిన ఏడుమెలికల వాగు
  • ఏడుమెలికల వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో నిలిచిన రాకపోకలు
  • కొడవటంచ, నాగారం, పాలగూడెం గ్రామాలకు నిలిచిన రాకపోకలు

5:35 PM, 21 Jul 2024 (IST)

  • భద్రాచలం వద్ద క్రమక్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
  • సాయంత్రం 5 గం.కు 41.09 అడుగులకు చేరిన నీటిమట్టం
  • భద్రాచలం: 8.85 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల
  • నీటిమట్టం 43 అడుగులకు చేరితే మెుదటి ప్రమాద హెచ్చరిక జారీ

4:53 PM, 21 Jul 2024 (IST)

  • భద్రాచలం వద్ద క్రమక్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
  • సాయంత్రం 4 గం.కు 41.03 అడుగులకు చేరిన నీటిమట్టం
  • భద్రాచలం: 8.61 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల
  • నీటిమట్టం 43 అడుగులకు చేరితే మెుదటి ప్రమాద హెచ్చరిక జారీ

3:34 PM, 21 Jul 2024 (IST)

  • హనుమకొండలో అలుగుపారుతున్న పరకాల చలివాగు
  • భారీ వర్షాలకు అలుగు పారుతున్న పరకాల చలివాగు

2:58 PM, 21 Jul 2024 (IST)

  • భద్రాచలం వద్ద క్రమక్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
  • మధ్యాహ్నం 2.30 గం.కు 40.5 అడుగులకు చేరిన నీటిమట్టం
  • నీటిమట్టం 43 అడుగులకు చేరితే మెుదటి ప్రమాద హెచ్చరిక జారీ

2:17 PM, 21 Jul 2024 (IST)

గోదావరిలో పెరుగుతున్న నీటిమట్టం

  • భద్రాచలం ఎగువ నుంచి వచ్చే వరదతో గోదావరిలో పెరుగుతున్న నీటిమట్టం
  • ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 39.5 అడుగులు
  • సాయంత్రానికి గోదావరి నీటి మట్టం 40 అడుగులకు చేరే అవకాశం
  • తాలిపేరు ప్రాజెక్టు 25 గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదలు
  • దుమ్ముగూడెంలో సీతవాగు పొంగి నీటి మునిగిన నారచీరల ప్రాంతం
  • చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం ముంపు గ్రామాలను అప్రమత్తం చేసిన అధికారులు
  • ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు యత్నాలు

2:17 PM, 21 Jul 2024 (IST)

ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

  • రాష్ట్రంలో మూడ్రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
  • ఇవాళ అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం
  • ఇవాళ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం
  • ఇవాళ ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం
  • రేపు, ఎల్లుండి మరికొన్ని జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం
  • ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
Last Updated : Jul 21, 2024, 9:38 PM IST

ABOUT THE AUTHOR

...view details