Heavy Rain in Bhadradri Kothagudem : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మణుగూరు పట్టణం వరద గుప్పెట్లో చిక్కుకుంది. శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షానికి ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మణుగూరు పట్టణం వరద ముంపునకు గురైంది. సుందరయ్య నగర్, ఆదర్శనగర్, చాకలి ఐలమ్మ నగర్, పైలట్ కాలనీ, కాళీమాత ఏరియా, అశోక్ నగర్, సాయి నగర్ తదితర లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది.
'2018' సీన్ రిపీట్! - వరద గుప్పెట్లో మణుగూరు - నీట మునిగిన భవనాలు - Heavy Rain in Bhadradri
Heavy Rain in Bhadradri Kothagudem : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. దీంతో మణుగూరు పట్టణం వరద గుప్పెట్లో చిక్కుకుంది. శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మణుగూరు పట్టణం వరద ముంపునకు గురైంది. దీంతో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
Published : Sep 1, 2024, 9:37 AM IST
|Updated : Sep 1, 2024, 11:38 AM IST
దీంతో స్థానికులు రాత్రంతా భయం గుప్పెట్లో గడిపారు. మణుగూరు పట్టణంలో రోడ్లపై వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అశోక్ నగర్లో వరద నీటిలో చిక్కుకున్న గర్భిణీ స్త్రీని, వృద్ధులను రెస్క్యూ బృందం బోటు సాయంతో వెళ్లి రక్షించింది. వర్ధమాంబ ప్రాంతాలను జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పరిశీలించి, వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.