Heavy Rain Falling in Srikakulam District : వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవం అస్థవ్యస్థం అవుతోంది. అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పాడింది. శనివారం మధ్యాహ్నం ప్రారంభమైన వర్షం ఈరోజు(ఆదివారం) వరకూ ఏకదాటిగా కురుస్తూనే ఉంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాల వల్ల జిల్లాలోని విద్యాసంస్థలకు కలెక్టర్ రేపు సెలవు ప్రకటించారు. ఉరుములు, గాలులు లేకుండానే భారీ వర్షం పడుతోంది. వర్షం కారణంగా వీధుల్లోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు పొంగే పరిస్థితి నెలకొంది. ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
అప్రమత్తంగా ఉండాలని సూచనలు : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా జిల్లాలో శనివారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. వాయుగుండం శ్రీకాకుళంకీ 350 కిలోమీటర్ దూరంలో ఉండడం వల్ల దాని ప్రభావం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఆది, సోమవారాల్లో 150 నుంచి 200 మి.మి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాలు కారణంగా రహదారులు, పాఠశాలలు, కళాశాలలో మైదానాలు జలమయం అయ్యాయి. వర్షాలతో నాగావళి, వంశధార నదులు పొంగే ప్రమాదం ఉందని, నదీ పరివాహ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు తెలియజేశారు.
ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్ - విశాఖలో విరిగిపడుతున్న కొండచరియలు - red alert for north andhra
మూడు రోజుల వరకు చేపల వేటకు వెళ్లవద్దు : ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులపై వర్షపు నీరు ప్రవహిస్తోంది. వాహనదారులతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాగావళి, వంశధార నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. తీర ప్రాంతాల్లో నివసిస్తున్న మత్స్యకారులు మూడు రోజుల వరకు చేపల వేటకు వెళ్లకూడదని అదేశాలు జారీ చేశారు.