Rain In Hyderabad today : భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో నిన్నటి నుంచి వర్షం పడుతుంది. ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డుతున్నారు. నేడు సైతం సాయంత్రం వరకూ వర్షం నిర్విరామంగా మోస్తరు వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ వెల్లడించింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.
నగర వ్యాప్తంగా ముసురు కమ్ముకుంది. జంట నగరాల పరిధిలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, బోరబండ ,యూసుఫ్ గూడా, ఈఎస్ఐ, సనత్ నగర్, ఎస్సార్ నగర్, కృష్ణానగర్, పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, లక్డికాపుల్, హిమాయత్ నగర్, నారాయణగూడ, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్ పరిధిలో వర్షాలు పడుతున్నాయి. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో వచ్చిన పర్యాటకలు వర్షానికి తడిసిముద్దయ్యారు. స్కూళ్లు, ఆఫీసులకు వెళ్లే వాహనదారులు వర్షంలో తడుస్తూనే వారి వారి గమ్యస్థానాలకు చేరుకున్నారు.
వర్షం కారణంగా ట్రాఫిక్ తోపాటు ఇతర సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ రెస్క్యూ టీంలో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నాయి. నీరు నిలిచే ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు వరదనీటిని నాలాల్లోకి మళ్లిస్తూ ఆయా ప్రాంతాల్లో ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. రాత్రి వరకు పలు చోట్ల మోస్తారు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.