Heavy Public At Khairatabad Ganesh Idol :ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ఖైరతాబాద్ గణేశుడి దర్శనం కోసం ఇటు ఎల్బీనగర్ వైపు నుంచి అటు మియాపూర్ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో మెట్రో స్టేషన్ పరిసరాలు సందడిగా మారాయి. వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో ఖైరతాబాద్ గణేశుడికి భక్తుల తాకిడి పెరిగింది. దీంతో మెట్రో రైలు యాజమాన్యం భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూసుకుంటోంది.
ఖైరతాబాద్ వినాయకుడును చూడటానికి తెలంగాణ చుట్టు పక్కల రాష్ట్రాల వారు కూడా వస్తుంటారు. రెండు రోజులు సెలవులు దీంతో తెలంగాణనే కాకుండా ఇతర రాష్ట్రాల వారు కూడా గణేశుడి దర్శనం కోసం వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అది కాకుండా నిమజ్జనానికి మూడు రోజుల సమయం ఉన్నందుకు రద్దీ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
టికెట్ కౌంటర్ల వద్ద, ఎగ్జిట్ గేట్ల వద్ద రద్దీ పెరగకుండా సూచనలు చేస్తోంది. క్యూఆర్ కోడ్ టికెట్లకు, కార్డ్ ద్వారా వెళ్లే ప్రయాణికులను వేరువేరుగా పంపిస్తోంది. స్టేషన్ లోపల ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ద్వారా ముందస్తుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని, కార్డులో సరిపడా డబ్బులు లేకపోతే ఎంట్రీ స్టేషన్‌లో రీఛార్జ్ చేసుకోవాలని సిబ్బంది సూచిస్తున్నారు.
ఖైరతాబాద్ గణేశుడికి భారీ ఎత్తున రుద్రహోమం - 280 జంటలతో ప్రత్యేక పూజ - Khairatabad Ganesh Pooja