Godavari Heavy Flows in Mulugu District : ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉరుకలెత్తుతోంది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతుండటంతో గోదావరి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతూ వస్తోంది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాటు వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి వరద తాకిడికి రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద రాళ్లతో ఇసుక బస్తాలతో కొత్తగా నిర్మించిన కరకట్ట గోదావరి వరద ఉధృతికి కొట్టుకుపోతోంది.
టెన్షన్! టెన్షన్! - 53.6 అడుగులకు చేరిన గోదావరి నీటి మట్టం - మూడో ప్రమాద హెచ్చరిక జారీ - Heavy Water Flow in Godavari
మత్తళ్లు పోస్తున్న చెరువులు.. ములుగు జిల్లాలో నిన్నటి వరకు మామూలుగానే కురిసిన వర్షం, గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా పడుతోంది. జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగిపొర్లాడుతున్నాయి. కుంటలు నిండుకుండలను తలపిస్తున్నాయి. చెరువులు మతల్లు పోస్తున్నాయి. వెంకటాపురం మండలం భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారిపై పాలెం వద్ద కుక్క వాగు, పాత్రపురం వద్ద బల్లకట్టు వాగుకు వరద పెరిగింది. కొండాపురం గ్రామం వద్ద రహదారిపై గోదావరి వరద నీరు చేరడంతో మూడు చోట్ల రవాణాకు అంతరాయం ఏర్పడింది.
నిలిచిన రాకపోకలు.. వెంకటాపురం మండలంలోని జిన్నెల వాగు, పెంక వాగు ఉదృతంగా ప్రవహించడంతో కలిపాక సీతారాంపురం తిప్పాపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాజేడు మండలంలోని పేరూరు, చంద్రుపట్ల గ్రామాల మధ్య ఉన్న మర్రిమాకు వాగు గోదావరి వరదతో మునిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వాజేడు మండలంలోని టేకులగూడెం గ్రామం వద్ద 163 జాతీయ రహదారిపై గోదావరి వరద నీరు చేరడంతో ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చే వాహనాలకు రాకపోకలు బందయ్యాయి.
మరోవైపు ఏటూరు నాగారం మండలం నుండి కన్నాయిగూడెం మండలం వరకు వెళ్లే కంతాన్‌పల్లి 2వ లోలెవల్ వంతెన వరద ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర పరిశీలించారు. వరద ప్రవాహం ఎక్కువ ఉండడంతో రాకపోకలు నిలిపివేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. లోత్తట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ముంపు గ్రామాల ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాని ఆదేశించారు.
ఏడజూసినా నీళ్లే - జలదిగ్బంధంలో రహదారులు - ప్రజలకు రవాణా తిప్పలు - HEAVY FLOODS IN MULUGU
ఉత్తర తెలంగాణ మీదుగా సాగే గోదావరిలో నో వాటర్ - కారణం తెలుసా? - No Water in Karimnagar Reservoirs