Haritha Haram Programme in Telangana: గత ప్రభుత్వం చేసిన నిధుల దుర్వినియోగాన్ని కాంగ్రెస్ సర్కార్ వెలికితీసే పనిలో పడింది. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని అంశాల్లో కమిటీ వేసి విచారణ జరిపిస్తోంది. మరికొన్ని వాటిపై ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన హరిత హారం పథకంపై దృష్టి సారించింది. ఈ కార్యక్రమంలో నాటిన మొక్కలు, చేసిన ఖర్చు, నిధుల దుర్వినియోగం తదితర అంశాలపై సమగ్ర సమాచారం తెలుసుకునేందుకు కమిటీ వేయాలని భావిస్తోంది. అంతకుముందే గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతల గ్రామాలు, ప్రాతినిథ్యం వహించినన నియోజకవర్గాల్లో పథకం అమలు తీరుపై అధ్యయనం చేయాలని సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Indian Forest Survey Report 2023 : హరితహారం ద్వారా తొమ్మిదేళ్లలో 273 కోట్ల మొక్కల పెంపకం
Government Focuse on Haritha Haram: ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలో 2015-16 నుంచి తొమ్మిది విడతలుగా చేపట్టిన 'తెలంగాణకు హరితహారం' పథకంపై చర్చ జరిగిందని నాయకులు పేర్కొన్నారు. ఈ పథకం(Haritha Haram) కింద ఇప్పటి వరకు 292 కోట్ల మొక్కలు నాటినట్లు, రూ.11,747 కోట్ల ఖర్చు చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్న నేపథ్యంలో వ్యయానికి అనుగుణంగా ఫలితాలు రాలేదనే అనుమానాలను సీఎం రేవంత్‌రెడ్డి, సంబంధిత మంత్రి వ్యక్తం చేసినట్టు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు హరితహారం పథకంలో నిధుల దుర్వినియోగం జరిగినట్టు వారిరువురూ అభిప్రాయపడినట్టు తెలిసింది.
Telangana Haritha Utsavam 2023 : 'పుడమి పులకరించింది.. ప్రకృతి పరవశించింది'