ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయసాయిరెడ్డి కుమార్తె ఆక్రమ నిర్మాణాలు- హైకోర్టు ఆదేశాలతో కూల్చివేతకు రంగంలోకి జీవీఎంసీ - GVMC SURVEY AT BHIMILI

భీమిలి బీచ్‌లో ఆక్రమణలు, కట్టడాలపై సమగ్ర సర్వే - హైకోర్టు ఆదేశాలతో మరోసారి సర్వే చేపట్టిన రెవెన్యూ, జీవీఎంసీ

GVMC_Survey_at_Bhimili
GVMC_Survey_at_Bhimili (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 8, 2025, 7:48 PM IST

GVMC Officials Survey at Bhimili Beach:హైకోర్టు ఆదేశాలతో మరో మారు భీమిలి బీచ్ అక్రమాలపై రెవెన్యూ, GVMC , కాలుష్య నియంత్రణ మండలి ఉన్నత అధికారులు రంగంలోకి దిగారు. అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు సీఆర్‌జడ్‌(CRZ) , ఆర్‌డీవో(RDO) ,పీసీబీ (PCB), మున్సిపల్‌ అధికారులు సర్వేలో పాల్గొన్నారు. విశాఖలోని భీమిలి తీర ప్రాంతంలో కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ (CRZ) పరిధిలో సర్వే చేయాలని, అక్రమ నిర్మాణాలుంటే కూల్చేయాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అధికారులు తీసుకున్న చర్యలపై కూడా వారంలో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.

విశాఖలో సీఆర్‌జడ్‌ (CRZ) పరిధిని తేల్చి, అక్రమ నిర్మాణాలను కూల్చడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక శాఖ అధికారులు మరొక శాఖపై బాధ్యతను నెట్టుకుంటూ అలసత్వం ప్రదర్శిస్తున్నారని, ఇకనైనా మేల్కొనాలని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఏపీ కోస్టల్‌ జోన్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (APCZMA), జీవీఎంసీ కమిషనర్, విశాఖ జిల్లా కలెక్టర్‌తో కమిటీని ఏర్పాటు చేసింది.

గుడ్ న్యూస్ - విశాఖ కేంద్రంగా సౌత్​ కోస్ట్​ రైల్వే జోన్​ - కేంద్ర కేబినెట్ ఆమోదం

నిబద్ధత గల అధికారుల బృందంతో సర్వే చేయించాలని కమిటీకి హైకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం సర్వేను భీమిలికి పరిమితం చేస్తున్నామని, తర్వాత భీమిలి నుంచి విశాఖలోని ఆర్‌కే బీచ్‌ వరకు సర్వే చేయిస్తామని తేల్చి చెప్పింది. నివేదిక ఇవ్వడంలో విఫలమైతే తదుపరి విచారణకు హాజరుకావాలని కమిటీ సభ్యులను ధర్మాసనం ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలతో అధికారుల్లో కదలిక వచ్చింది.

విజయసాయిరెడ్డి కుమార్తె అక్రమాలు: భీమిలి బీచ్‌ వద్ద సముద్రానికి అతి సమీపంలో సీఆర్‌జడ్‌ నిబంధనలకు విరుద్ధంగా వైఎస్సార్సీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని జనసేన కార్పొరేటర్‌ మూర్తి యాదవ్‌ గతంలో హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. భీమిలిలోని సీఆర్‌జడ్‌ జోన్‌ పరిధిలో శాశ్వత రెస్ట్రోబార్ల ఏర్పాటుతో తాబేళ్ల ఉనికికి ప్రమాదం పొంచి ఉందంటూ గ్రామాభివృద్ధి సేవా సంఘం అధ్యక్షుడు గంటా నూకరాజు మరో పిల్‌ వేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు సీఆర్‌జడ్‌ పరిధి నిర్ణయించి, అక్రమ నిర్మాణాలు ఉంటే కూల్చివేయాలని ఆదేశించింది.

విశాఖ నడిబొడ్డున ‘ఐటీ’కి ఐకానిక్‌ భవనం - 11 అంతస్తుల్లో అత్యాధునిక సౌకర్యాలు

వైఎస్సార్సీపీ అక్రమాలకు అడ్డుకట్ట - వీఎంఆర్‌డీఏ మాస్టర్ ప్లాన్ పునఃపరిశీలన

ABOUT THE AUTHOR

...view details