Gurukulam Students Facing Problems in Enkoor : పేద విద్యార్థులకు చక్కటి విద్యాబుద్దులు నేర్పాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాకు రెండు గురుకులాలు అప్పట్లో ప్రారంభించారు. ఒకటి బాలురు, మరొకటి బాలికలకు ఏర్పాటు చేయించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బాలురకు ఏన్కూరు, బాలికలకు వైరాలో విద్యాలయాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత బూర్గంపహాడ్‌లో బాలికలకు మరో పాఠశాల మంజూరు చేశారు. ఇవన్నీ జనరల్ కేటగిరి గురుకులాలుగా ఉన్నాయి.
Enkoor Gurukul students Problems :కొన్నాళ్ల తర్వాత సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖలు, పదేళ్ల క్రితం వెనకబడిన తరగతుల శాఖలు గురుకులాలకు అందుబాటులోకి వచ్చాయి. మొట్టమొదటగా ప్రారంభమైన ఏన్కూరు, వైరా గురుకులాలు(Gurukuls) మాత్రం ఎలాంటి సంక్షేమశాఖ పరిధిలో లేవు. విద్యాశాఖలో మిగులు నిధులతో వీటిని నిర్వహించాల్సి వస్తోంది. విద్యాశాఖలో నిధులు తక్కువగా ఉండటంతో ఈ పాఠశాలలకు సదుపాయాలు అందడం లేదు. కేంద్ర ప్రభుత్వ నిధులైన రాజీవ్ విద్యామిషన్, సర్వశిక్షా అభియాన్ పథకాలతో(Sarva s పాఠశాల తరగతి గదులు నిర్మాణం చేయడం మినహా ఎలాంటి అభివృద్ది చేపట్టడం లేదు.
నిజాం హాస్టల్లో కనీస సౌకర్యాలు లేవంటూ విద్యార్థుల ఆందోళన
Gurukulam Students Facing Problems : ఈ గురుకులంలో వేలాది మంది విద్యార్థులు చదువుకుని వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో నిలిచారు. ప్రతి ఏడాది పదో తరగతిలో నూరు శాతం ఫలితాలతోపాటు తొలి పది ర్యాంకుల్లో స్థానం దక్కించుకుంటారు. అలాంటి ఈ గురుకులంలో విద్యార్థులు నిత్యం అనేక కష్టాలు ఎదుర్కుంటున్నారు. తొలినాళ్లలో 250 మంది విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వసతి గృహంలో ప్రస్తుతం 650 మంది బస చేయాల్సి వస్తోందంటే సమస్య ఏ మేరకు ఉందో స్పష్టమవుతోంది.
Inadequate Facilities In Gurukulam :రాజీవ్ విద్యామిషన్(Rajiv Vidya Mission) సహకారంతో పాఠశాల భవనాలు సమకూరినా గురుకుల విద్యాలయ సంస్థ ద్వారా వసతుల కల్పనకు ఎలాంటి సహకారం అందడం లేదు. వసతి గృహం సరిపడా లేకపోవడంతో 6,7 తరగతుల విద్యార్థులు తరగతి గదుల్లోనే సర్దుకుంటున్నారు. పగలు తరగతి గదిగా, రాత్రి వసతిగృహంగా వాడుతున్నామని... పుస్తకాల సంచులు, పెట్టెల మధ్య కష్టంగా ఉందంటుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.