Manda Krishna Madiga Illegal Constructions Demolish :ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు చెందిన అక్రమ కట్టడాలను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు శుక్రవారం కూల్చివేశారు. హనుమకొండలోని హంటర్ రోడ్డు సర్వే నంబరు 125కేలోని 400 గజాల నిర్మాణాలను నేలమట్టం చేశారు. హంటర్ రోడ్డులో తమకు చెందిన 400 గజాలను మందకృష్ణ మాదిగతో పాటు జ్యోతి, ఇద్దయ్యలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని అధికారులకు నంబూరి చారుమతి అనే మహిళ ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు విచారణ చేసిన ఉన్నతాధికారులు ఆక్రమణ నిజమేనని తేల్చి కట్టడాలను కూల్చేయాలని 2022 సెప్టెంబరులో ఆదేశాలు ఇచ్చారు.
మందకృష్ణ మాదిగకు బుల్డోజర్ల షాక్ - 400 గజాల నిర్మాణాలు నేలమట్టం - MANDA KRISHNA ILLEGAL CONSTRUCTION
మందకృష్ణ మాదిగ అక్రమ కట్టడాలు కూల్చివేత - కూల్చివేసిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు
Manda Krishna Madiga Illegal Constructions Demolish (ETV Bharat)
Published : Jan 25, 2025, 10:30 AM IST
ఈ నిర్మాణాలు రెండేళ్లు దాటినా కూల్చలేదని చారుమతి జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)ను ఆశ్రయించారు. ఈ మేరకు జనవరి 24లోపు నిర్మాణాలను నేలమట్టం చేయాలని ఆదేశించగా, ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఉత్తర్వులను రద్దు చేయాలని మందకృష్ణ మాదిగ హైకోర్టును ఆశ్రయించారు. అయినా ఆయనకు ఊరట దక్కలేదు. దీంతో మున్సిపల్ సిబ్బంది శుక్రవారం కట్టడాలను కూల్చి వేశారు.