Fresh Water Project Tender For Musi :మూసీలో సుందరీకరణలో భాగంగా ఏడాది పొడవునా మంచినీటిని వదిలేందుకు వీలైన ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చే వారంలోనే టెండర్లను పిలవనుంది. హైదరాబాద్‌కు మల్లనసాగర్ నుంచి 15 టీఎంసీల తాగునీటిని తీసుకువచ్చే ప్రాజెక్టును సంవత్సరంలోగా పూర్తి చేయడానికి కసరత్తు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో రూ.5,500కోట్ల ప్రాజెక్టుపై పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్ శుక్రవారం సమీక్షించారు. తక్షణం టెండర్లు పిలవాలని నిర్ణయించారు. దీంతో అధికారులు ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
విడతల వారీగా రెండు టీఎంసీల నీరు :పైప్‌లైన్ ద్వారా జంటజలశయాలకు ప్రభుత్వం రాజధాని పరిధిలో 55కి.మీ.ల పొడవున్న మూసీ సుందరీకరణ చేపట్టింది. ఇది పూర్తయ్యేవరకు మూసీలో నిరంతరాయంగా మంచినీటి ప్రవాహం ఉంటేనే ఫలితం ఉంటుందని అధికారులు సూచించారు. ఇందుకు జంట జలాశయాల నుంచి సంవత్సరంలో రెండున్నర టీఎంసీల నీటిని విడతల వారీగా విడుదల చేయాలని అభిప్రాయపడుతున్నారు.
గోదావరి నుంటి నీటిని తీసుకొస్తేనే ది సాధ్యమని ఈ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును తక్షణం చేపట్టాలని నిర్ణయించింది. మల్లన్నసాగర్ నుంచి 15 టీఎంసీల నీటిని తీసుకువచ్చే పైప్‌లైన్ ప్రాజెక్టును అధికారులు రూపకల్పన చేశారు. 12.5 టీఎంసీల నీటిని ఘనపూర్ రిజర్వాయర్‌కు తెచ్చి అక్కడ శుద్ధి చేసి నగర అవసరాలకు ఉపయోగిస్తారు. మిగిలిన రెండున్నర టీఎంసీలను పైపులైను ద్వారా జంటజలాశయాలకు తీసుకురావాలని నిర్ణయించారు. జలాశయాలకు నీరు చేరిన తరువాత అవసరమైనప్పుడు సుందరీకరణ చేసిన మూసీలోకి వదిలేందుకు ప్లాన్ చేశారు.