Govt Not Renewal Cold Storage License in Guntur District :గుంటూరు జిల్లాలో శీతల గోదాముల లైసెన్స్ రెన్యూవల్‌కు నిబంధనలు అడ్డంకిగా మారాయి. మార్చి నెలతోనే గడువు ముగిసినా ఒక్కగోదాముకూ లైసెన్సు పునరుద్ధరించలేదు. ఎప్పుడో నిర్మించిన గోదాములకు కొత్తగా వచ్చిన ఫైర్ సేఫ్టీ చట్టాన్ని (Fire Safety Act) అన్వయించడంతో శీతల గోదాములకు లైసెన్సుల పునరుద్ధరణ కష్టంగా మారింది.
లైసెన్సుల రెన్యూవల్‌కు అడ్డంకులు:ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో 128 శీతల గోదాములు ఉన్నాయి. స్థానిక రైతులే కాకుండా వివిధ ప్రాంతాల రైతులు మిర్చి పంటను తెచ్చి గోదాముల్లో నిల్వ చేసుకుంటారు. పంటకు మంచి ధర లభించినప్పుడు లేదా నగదు అవసరమైనప్పుడు మిర్చిని విక్రయించుకుంటారు. శీతల గోదాముల నిర్వహణకు మార్కెంటింగ్ శాఖ నుంచి లైసెన్సు తీసుకుని ఐదేళ్లకోసారి పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. 2024 మార్చితో 105 శీతల గోదాములకు లైసెన్స్ గడువు ముగిసింది. రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి మార్కెటింగ్ శాఖ అనుమతి ఇవ్వటం లేదు. మొదట్లో ఎన్నికల కోడ్ సాకు చూపించిన అధికారులు ఇప్పుడేమో ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ అడుగుతున్నారని యజమానులు వాపోతున్నారు.
అన్నదాతల అగచాట్లు - శీతల గోదాములు లేక పంటను నిల్వ చేసేందుకు విలవిల - FARMERS SUFFERING IN GUNTUR