Govt Administrative Approval For Amaravati Works: రాజధాని అమరావతిలో రూ.11,467 కోట్లతో పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాలనామోదాన్ని ఇచ్చింది. ఈ మేరకు పురపాలక శాఖ కార్యదర్శి కె. కన్నబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకూ నిర్వహించిన వేర్వేరు సీఆర్డీఏ అథారిటీ సమావేశాల్లో తీసుకున్న పనులను చేపట్టేందుకు గానూ ప్రభుత్వం ఈ పాలనామోదాన్ని జారీ చేసింది.
రూ.11,467 కోట్ల అమరావతి పనులకు పాలనామోదం - ఉత్తర్వులు జారీ - APPROVAL FOR AMARAVATI WORKS
అమరావతిలో రూ.11,467 కోట్లతో పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాలనామోదం - పురపాలక శాఖ కార్యదర్శి కన్నబాబు ఉత్తర్వులు జారీ
Govt Administrative Approval to CRDA (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 8, 2025, 4:52 PM IST
మొత్తం 20 ఇంజనీరింగ్ పనులు చేపట్టేందుకు సీఆర్డీఏకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాజధాని పరిధిలోని వివిధ నిర్మాణ పనులకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేందుకు సీఆర్డీఏ కమిషనర్‌కు అనుమతి మంజూరు చేస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.