Govt Departments Helpline Numbers In TG : ప్రజలు తమ సమస్యలను నేరుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు వీలుగా ఆయా ప్రభుత్వ శాఖలు హెల్ప్‌లైన్ సెంటర్లను (సహాయకేంద్రాలను ఏర్పాటు) చేశాయి. ఇందులో కొన్నిశాఖలు టోల్‌ఫ్రీనంబర్లను అందుబాటులో ఉంచగా మరికొన్ని ఫోన్‌నంబర్లను కేటాయించారు. కొన్ని డిపార్ట్మెంట్లు యాప్‌లను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చాయి. మండల, జిల్లా స్థాయిలో సమస్యలకు పరిష్కారం లభించనప్పుడు ప్రజలు ఈ టోల్‌ఫ్రీనంబర్లకు ఫోన్ చేసి తగిన సలహాలు, సూచనలను పొందవచ్చు.
విద్యుత్తుశాఖ సరికొత్తగా : ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇటీవల సరికొత్తగా 1912 టోల్‌ఫ్రీనంబర్‌ను పరిచయం చేసింది. వినియోగదారులు నేరుగా ఈ నంబరుకు ఫోన్ చేయడం చేసి వారి సమస్యకు పరిష్కారం పొందవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. సేవల నాణ్యత కోసం కాల్ రికార్డు చేయడమే కాకుండా వినియోగదారుడి ఫిర్యాదు సంబంధిత అధికారి వరకు వెళ్తుంది. ఆ అధికారి కంప్లైంట్‌ను ఎలా పరిష్కరించారో తెలియజేస్తూ ఉన్నతాధికారి వివరాలను పంపిస్తాడు. లంచం అడితే ఉద్యోగుల గురించి కూడా ఈ నంబరుకు కంప్లైంట్ చేయవచ్చు. అధికారులు ఎన్‌పీడీసీఎల్ యాప్ సైతం అందుబాటులోకి తీసుకువచ్చారు.
పౌరసరఫరాల శాఖ :సివిల్ సప్లై డిపార్ట్మెంట్ 180042500333 టోల్‌ఫ్రీ నంబరును అందుబాటులో ఉంచింది. రేషన్ పంపిణీ, ధాన్యం కొనుగోళ్లలో తలెత్తేటువంటి ఇబ్బందులపై ఈ నంబరుకు ఫోన్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఆఫీసు వేళల్లో ఫోన్ చేయడానికి ప్రయత్నించాలి.
వృద్ధుల కోసం :వయో వృద్ధుల కోసం సర్కారు 14567 టోల్‌ఫ్రీనంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. పింఛన్లు, పోషణ, ఆరోగ్యసమస్యల గురించి వృద్ధులు ఈ నంబరుకు కాల్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చు.
భూపరిపాలనశాఖ (ధరణి) :భూ సమస్యలకు సంబంధించి సంప్రదించేందుకు సీసీఎల్‌ఏ 040-2320027 నంబరును ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఇందులోనే ధరణి సమస్యలకు సంబంధించి 08744241950 నంబర్‌ను కేటాయించారు. దీంతో పాటు వాట్సప్ నంబరు 9133089444 కూడా ఉంది. సమస్య ఆధారంగా ఏదైనా నంబరును సంప్రదించవచ్చు.
ఇవి ఎంతో ఉపయుక్తం :