Governor Tamilisai On Voters Day 2024: ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవడం తప్ప ప్రత్యామ్నాయ మార్గం లేదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని జేఎన్టీయూ ఆడిటోరియంలో నిర్వహించిన 14వ జాతీయ ఓటర్ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గత ఎన్నికల్లో తమకు ఓటు వేయకుంటే చనిపోతానని కొందరు నాయకులు బెదిరించారని అలాంటి విషయాలను ఉపేక్షించవద్దని ఎన్నికల సంఘానికి సూచించారు.
National Voters Day Celebrations At JNTU :ఓటు వేసేటప్పుడు అభ్యర్థులను పూర్తిస్థాయిలో విశ్లేషించి, మంచి వారిని ఎన్నుకోవాలని యువతకు గవర్నర్ సూచించారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన సెలవును విహార యాత్రలకు వెళ్లేందుకు ఉపయోగించడం బాధాకరం అని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పకడ్బందీగా ఓటింగ్ నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల సంఘానికి అభినందనలు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో కేవలం 46% ఓటు నమోదు అవ్వడం బాధాకరమని అలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు.
14th National Voters Day Celebrations in Hyderabad :అనంతరం ఓటరు దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఓటు హక్కును వినియోగించుకోవడమే పౌరుల ప్రథమ బాధ్యత కావాలని గవర్నర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి సీఈఓ వికాస్ రాజ్‌తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి: కలెక్టర్ శరత్