ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మరిన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు - సీటు ఫ్రీ!

తెలంగాణలో రాబోతున్న ప్రభుత్వ వైద్య కళాశాలలు - చిగురించిన పేద విద్యార్థుల ఆశలు

free_medical_seats_in_telangana
free_medical_seats_in_telangana (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

Government Medical Colleges Coming up in Telangana:పోటీ ప్రపంచంలో ప్రస్తుతం హవా అంతా ఇంజినీర్లు, డాక్టర్లదే. ప్రతి ఇంటికో ఇంజినీర్ తప్పక ఉంటున్నారు. కానీ డాక్టర్లు చాలా అంటే చాలా తక్కువగా ఉంటున్నారు. ఇందుకు కారణం కుటుంబ ఆర్థిక పరిస్థితులు. అయితే కుటుంబంలో ఒక్కరైనా వైద్య వృత్తి చేస్తే బాగుంటుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఎంబీబీఎస్ సీటు సాధించడం అంత సులువు కాదు. కష్టపడి చదివి సీటు దక్కించుకున్నా లక్షల రూపాయలు ఖర్చు చేసే ఆర్థిక స్తోమత చాలా మందికి ఉండదు. అందుకే డాక్టర్​ చదువుపై ఎంత మమకారం ఉన్నా చాలా మంది ఆ ఆశను, ఆశయాన్ని మనసులోనే చంపేసుకుంటుంటారు.

అయితే తాజాగా తెలంగాణలోని పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఇక నుంచి వైద్య విద్య తలకు మించిన భారంగా ఉండదు. ఎందుకంటే తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలు రాబోతున్నాయి. అయితే వీటి రాకతో పేద విద్యార్థుల్లో వైద్య విద్య చదవాలన్న ఆశలు చిగురిస్తున్నాయి. ఫ్రీ సీటు సాధించిన విద్యార్థులు ప్రస్తుతం ఈ కళాశాలల్లో చదువుతూ భవిష్యత్ డాక్టర్లుగా రూపుదిద్దుకుంటున్నారు. మరి ఆ విద్యార్థుల భవిష్యత్ లక్ష్యాలు, వారి మనసులోని మాట ఏంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం.

ABOUT THE AUTHOR

...view details