Government Distributed Lands In Uninhabitable Place: నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో కనీస వసతులు ఏర్పాటు చేయకుండానే స్థలాలు ఇచ్చి జనాన్ని నట్టేట ముంచుతున్నారు. జగనన్న కాలనీలో సొంతిటి కల కలగానే మిగిలిపోయింది.జగనన్న కాలనీలుమామిడి తోటల మధ్యలో ఇవ్వటంతో ముళ్ల పొదలతో నిండిపోయింది. ఈ కాలనీలోకి వెళ్లాలంటేనే ప్రజలు, లబ్దిదారులు భయాందోళనలకు గురవుతున్నారు.
Lack of Facilities in Jagananna Colonies: జగనన్న కాలనీలో కష్టాలెన్నో.. కనీస వసతులు లేకుండా దారుణమైన దుస్థితి..
ప్రభుత్వం కేటాయించిన జగనన్న లేఅవుట్లు (Jagananna Layout) లబ్ధిదారులకు అక్కరకు రావడం లేదు. నివాసయోగ్యం కాని స్థలాల్లో ఇళ్లు ఇవ్వడంతో పేదల సొంతింటి స్వప్నం కలగానే మిగిలిపోతుంది. కృష్ణా జిల్లా అవనిగడ్డలో కృష్ణా నది కరకట్ట కింద సుమారు 22 ఎకరాల్లో 807 మంది లబ్ధిదారులకు స్థలాలు కేటాయించారు. 2021 జనవరి 18న సమావేశం ఏర్పాటు చేసి జగనన్న కాలనీలో సకల వసతులు ఏర్పాటు చేస్తామని ఎంతో ఆర్భాటంగా ప్రకటించారు. అయితే మూడు సంవత్సరాలు దాటినా లేఅవుట్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. 807 మంది లబ్దిదారులు ఉన్న లేఅవుట్లో ఇప్పటికి మట్టి రోడ్లు దర్శనం ఇస్తున్నాయి. కాలనీలోకి వెళ్లే మార్గంలో పెద్ద గుంతలు ఉండటంతో ఇళ్ల నిర్మాణం కోసం ఇసుక, రాయి, ఇతర సామాగ్రి తరలించడానికి వాహనాలు వెళ్లలేని పరిస్థితి. కరెంట్ తీగలు ఉన్నా విద్యుత్ సరఫరా ఇవ్వలేదు. కుళాయిలు ఉన్నా నీటి సౌకర్యం లేదు. జగనన్న లేఅవుట్ మామిడి తోటలో ఉండటంతో ముళ్ల పొదలు, పిచ్చిమొక్కలు మొలిచి చిట్టడవిని తలపిస్తోంది.