తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇక పాఠశాలల్లో తెలుగు తప్పనిసరి - ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం - TELUGU COMPULSORY IN SCHOOL

పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరిగా బోధించాలని ప్రభుత్వం నిర్ణయం - పదో తరగతికి 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు

Telugu a Compulsory in School
Telugu a Compulsory in School (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 25, 2025, 7:54 PM IST

Telugu Subject Compulsory In Schools :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరిగా బోధించాలని డిసైడ్ చేసింది. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ సహా ఇతర బోర్డు పాఠశాలల్లో అమలు చేయాలని ఆదేశించింది. తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్‌గా అమలు చేసేందుకు విద్యాశాఖకు అనుమతి ఇచ్చింది. తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్‌గా పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. 9వ తరగతి వారికి 2025-26 విద్యా సంవత్సరం నుంచి, పదో తరగతికి 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కోంది.

ABOUT THE AUTHOR

...view details