Good Touch and Bad Touch Instructions for Girls :పిల్లలపై లైంగిక అత్యాచారాలు జరుగుతున్నాయన్న వార్త వినని రోజే లేదు. నిత్యం పదుల సంఖ్యలో ఎక్కడో ఒక చోట అఘాయిత్యాలు జరుగుతునే ఉన్నాయి. అమ్మాయిలకు ఎటువైపు నుంచి ఎప్పుడు ఏ ఆపద వస్తుందో తెలియట్లేదు. చివరికి నా అనుకున్న వారిని కూడా నమ్మలేని పరిస్థితులు వచ్చాయి. చాల ఘటనలను పరిశీలిస్తే తెలిసిన వారే అత్యాచారాలకు పాల్పడుతుండటం ఆశ్చర్యనికి గురిచేస్తొంది. ఇలాంటి సంఘటనలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో తరచూ జరుగుతున్నాయి.
ఇటీవల వెలుగుచూసిన కొన్ని సంఘనలు :
- ఆగస్టు 3న భవానీపురంలో ఓ ప్రధానోపాధ్యాయుడు పదోతరగతి విద్యార్థినితో అసభ్యంగా మాట్లాడాడు. సాయంత్రం కంప్యూటర్ గదికి తీసుకెళ్లి వేధించాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- విస్సన్నపేట మండలంలో ఓ గ్రామంలో ఈనెల 14న తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లడంతో ఇంట్లో బాలిక ఒంటరిగా ఉంది. ఇదే అవకాశంగా అదే గ్రామానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి బలవంతంగా ఇంటి వెనుకకు లాక్కెళ్లి అకృత్యానికి పాల్పడ్డాడు. తర్వాత బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- బందరులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతోందా బాలిక. ఈనెల 6న సాయంత్రం బడి వదిలాక స్నేహితురాలిని కలిసేందుకు వెళ్లి తిరిగొస్తోంది. ఓ యువకుడు ఆమెను అడ్డగించి బైక్‌పై నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యం చేశాడు. మానసిక క్షోభ అనుభవించలేక వారం తర్వాత ఆమె ఇంట్లో చెప్పింది.
- విస్సన్నపేట మండల విద్యార్థిని ఇంటర్ చదువుతోంది. అదే గ్రామ యువకుడు ప్రేమిస్తున్నానని వెంటపడేవాడు. ఈనెల 14న ఆమె కళాశాల నుంచి వెళ్తుండగా మధ్యలో ఓ భవనంలోకి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. మరుసటి రోజు బాధితురాలు తల్లికి వివరించగా నిందితుడిపై పోక్సో కేసు పెట్టారు.
మాచర్లలో దారుణం - కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి కుమార్తెపై అత్యాచారం - FATHER RAPED DAUGHTER
తల్లిదండ్రులదే బాధ్యత :పిల్లల భవిష్యత్తు విషయంలో ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంశంలోనూ అవగాహన కల్పించడానికి అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఇందులో ఆలస్యం జరగకూడదు. లేదంటే వారి జీవితంలో ఎక్కడైనా, ఎప్పుడైనా ఇది పెను సమస్యగా మారి వేధిస్తుంది. పిల్లలకు ఎవరి వద్దయినా అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే వారి గురించి ఇంట్లో చెప్పమని చెప్పాలి. వారికేదైనా చేదు అనుభవం ఎదురై ఉంటే సున్నితంగా, మెల్లగా అడిగి సమస్య తెలుసుకొని పరిష్కరించాలి.