ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ ఆలోచన సరికాదు - నీళ్లలో ఉన్నా ఏం కాదు - Polavaram Diaphragm Wall condition - POLAVARAM DIAPHRAGM WALL CONDITION

Global Experts Team on Diaphragm Wall: పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన డయాఫ్రం వాల్‌ కట్టడంపై వరద నీరు ప్రవహంచినా ఏమీ కాదని అంతర్జాతీయ జలవనరుల నిపుణులు అంటున్నారు. నీళ్లలో కొంతకాలం ఉంటే దెబ్బతింటుందనే ఆలోచన సరికాదన్నారు. డయాఫ్రం వాల్‌కు మరో కొత్త కట్టడం అనుసంధానంతో రెండింటి సమన్వయం సాధ్యం కాదనుకోవడాన్ని తప్పుబట్టారు. డయాఫ్రం వాల్‌ను సందర్శించిన వేళ నిపుణలు ఈ అభిప్రాయాలు వ్యక్తం చేశారని తెలిసింది.

Global Experts Team on Diaphragm Wall
Global Experts Team on Diaphragm Wall (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 2, 2024, 7:36 AM IST

నీళ్లలో ఉన్నా డయాఫ్రం వాల్‌కు ఏం కాదు - అంతర్జాతీయ నిపుణుల వ్యాఖ్యలు (ETV Bharat)

Global Experts Team on Diaphragm Wall : పోలవరం ప్రాజెక్టు పరిస్థితిని సమీక్షించేందుకు వచ్చిన అంతర్జాతీయ నిపుణులు వివిధ కోణాల్లో పరిస్థితుల అంచనా వేస్తున్నారు. కేంద్ర జలసంఘం నిపుణులు, అఫ్రి డిజైన్‌ సంస్థ ప్రతినిధులు, స్థానిక ఇంజినీరింగ్‌ అధికారులు, ఇతర సంస్థల ప్రతినిధులు ఇచ్చే సమాధానాలు వింటూనే ఎక్కడికక్కడ వారిని అనుమానాలను తీర్చుతున్నారు.

Observation of Polavaram Diaphragm Wall :భారీ వరదలకు కీలక కట్టడం డయాఫ్రం వాల్‌ ధ్వంసమైనందున కొత్తది నిర్మించాలా, పాతదానికే మరమ్మతులు చేసి, కొంతమేర కొత్తది నిర్మించి పాత కట్టడానికి అనుసంధానించాలా అన్న కోణంలో సోమవారం చర్చ జరిగింది. ప్రస్తుతం ఉన్న డయాఫ్రం వాల్‌ను మరమ్మతు చేసుకుంటే సరిపోతుంది కదా అని నిపుణుడొకరు వ్యాఖ్యానించారు. ఈ కట్టడం నిర్మాణం ఎప్పుడు ప్రారంభమయింది? ఎప్పుడు పూర్తయింది అని నిపుణులు ప్రశ్నించారు. డయాఫ్రం వాల్‌ వరద నీటిలో ఉండిపోయింది కదా ఏం నష్టం జరగదా అని కొందరు నిపుణుల వద్ద సందేహం వ్యక్తం చేయగా వరద ఆ కట్టడంపై ప్రవహించినంత మాత్రాన ఏమీ నష్టం వాటిల్లదని, వరద నీటిలో ఉన్నంత మాత్రాన ఏం జరగదని సమాధానమిచ్చారు.

పోలవరం ప్రాజెక్టు వద్ద కొనసాగుతున్న నిపుణుల బృందం పరిశీలన - International Experts at Polavaram

డయాఫ్రం వాల్‌కు కొత్త కట్టడం జత చేస్తే ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా అని మరికొందరు ప్రశ్నించగా అలాంటివేమీ ఉండవన్నారు. 20 ఏళ్ల కిందట నిర్మించిన డయాఫ్రం వాల్‌ను వెడల్పు చేసి నిర్మించుకున్న ఘటనలూ ఉన్నాయన్నారు. పాత డయాఫ్రం వాల్‌ ఒక సామర్థ్యంతో, కొత్తది మరో సామర్థ్యంతో పని చేస్తాయన్నది సరికాదన్నారు. డయాఫ్రం వాల్‌పై జాతీయ జలవిద్యుత్తు పరిశోధన సంస్థ పరీక్షించి ఇచ్చిన నివేదిక ప్రతులను నిపుణులు తీసుకున్నారు. డయాఫ్రం వాల్‌పై ఎలక్ట్రోడ్ల సాయంతో కాకుండా అక్కడక్కడా తవ్వి, మెటీరియల్‌ తీసి పరీక్షించాలన్నారు. డయాఫ్రం వాల్‌ గ్యాప్‌ల్లో ఉన్న మట్టి, ఇసుక నమూనాలను నిపుణులు పరిశీలించగా అది డయాఫ్రం వాల్‌లో ఉన్న మెటీరియల్‌ కాదని, పైన వచ్చి చేరిన ఇసుక మాత్రమే అని అధికారులు తెలిపారు. దీంతో డయాఫ్రం వాల్‌ ధ్వంసమైన చోట కొన్ని నమూనాలు తీసి పరిశీలించారు.

పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటన - International Experts on Polavaram

ఎగువ కాఫర్‌ డ్యామ్‌నూ అంతర్జాతీయ నిపుణులు పరిశీలించి ఇప్పటికే చేసిన పరీక్షల నివేదికలను సరిచూశారు. మరికొన్ని పరీక్షలు చేయించాలన్నారు. వాటి ఫలితాలను మంగళవారం చూస్తామని చెప్పారు. దీంతో ఇంజినీరింగ్‌ అధికారులు వెంటనే ఆ పరీక్షలు ప్రారంభించారు. వైబ్రో కాంపాక్షన్‌ పనులు, గ్యాప్‌-1 ప్రధాన డ్యాం ప్రాంతాన్ని నిపుణులు పరిశీలించారు. బంకమట్టి ఉన్న చోట నిర్మాణాలు కష్టమనే అభిప్రాయాన్ని తోసిపుచ్చిన నిపుణులు అలా నిర్మించిన ప్రాంతాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయన్నారు.

అంతర్జాతీయ నిపుణులు ఇవాళ, రేపు పోలవరంలోనే సమీక్షలు నిర్వహించనున్నారు. అందుబాటులో ఉన్న సమాచారంపై అధికారులు, ఇతర నిపుణులతో చర్చిస్తారు. ప్రస్తుత నివేదికలకు తోడు ఇంకా ఏమేం సమాచారం కావాలో అధికారులు వారిని అడిగి తెలుసుకుంటున్నారు.

"ఎందుకు? ఏమిటి? ఎలా?"- పోలవరంపై అంతర్జాతీయ నిపుణుల అధ్యయనం - International experts to Polavaram

ABOUT THE AUTHOR

...view details