Precautionary Measures on Manholes in Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షాలు పడుతున్నందున అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. వరద నీటితో మ్యాన్‌హోల్స్ నిండిపోయి ప్రజలకు కనిపించకుండా ఉండే ప్రమాదం ఉందని, దీని వల్ల తీవ్ర నష్టం జరిగేందుకు అవకాశం ఉందని భావించింది. ఈ క్రమంలోనే జలమండలి అధికారులు వరదలోనూ ప్రజలకు మ్యాన్‌హోల్స్ కనిపించేలా వాటిపైన ఎరుపు రంగు వేస్తున్నారు. భాగ్యనగరంలో ఎక్కువ లోతు ఉన్నవి అధికంగా ఉన్నందున వాటిని ఎవరైనా తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Red Color Manholes in Hyderabad: వర్షాలు పడినప్పుడు రోడ్లపై అధికంగా నీరు ప్రవహించి మ్యాన్‌హోల్స్‌ను స్థానికులు తప్ప ఇతరులు గుర్తించేందుకు ఇబ్బందిగా ఉండేది. కొన్నిసార్లు మ్యాన్‌హోల్‌లో పడి ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. కొంత మంది మరణించిన ఘటనలు ఉన్నాయి. వీటన్నింటని దృష్టిలో పెట్టుకున్న అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న లోతైన మ్యాన్‌హోల్స్‌ను ప్రజలు గుర్తించేలా జలమండలి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అవి అత్యంత ప్రమాదకరమని తెలిసే విధంగా వాటికి ఎరుపు రంగును వేస్తోంది.
Manhole Cleaning Robot : మ్యాన్‌హోల్స్ క్లీన్ చేస్తున్న 'రోబో'.. 360 డిగ్రీల్లో.. చిన్నమరక కూడా లేకుండా..
Manholes in Hyderabad Covered with Safety Grills: జీహెచ్ఎంసీ వ్యాప్తంగా సుమారు 25 వేలకు పైగా లోతైన మ్యాన్‌హోల్స్ ఉన్నాయని అధికారులు తెలిపారు. వీటిపై ప్రస్తుతం సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారు. వర్షాకాలం అయినందున మ్యాన్‌హోల్స్‌లో పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో రహదారులు, ఇతర ప్రాంతాల్లో ఉన్న మ్యాన్‌హోల్స్‌ను ఎవరైనా తెరిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని జలమండలి హెచ్చరించింది.
Manhole Cleaning and Safety Measures: జలమండలి చట్టం 1989 సెక్షన్ 74 ప్రకారం అక్రమంగా మ్యాన్‌హోల్స్ తెరిస్తే క్రిమినల్ కేసులు పెట్టే అధికారం జలమండలికి ఉందని పేర్కొంది. వానలు కురుస్తుండటంతో ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, సేఫ్టీ ప్రొటోకాల్ టీమ్ వాహనాలను సిద్ధం చేశామని తెలిపింది. వర్షాకాలంలో ఎప్పటికప్పుడు మ్యాన్‌హోల్స్‌ను శుభ్రం చేసేందుకు యంత్రాలను సిద్దం చేశామని వెల్లడించింది. సీవరేజ్ సమస్యలు ఉంటే ప్రజలు జలమండలి వినియోగదారుల సేవా కేంద్రం 155313కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరింది.
మ్యాన్‌హోల్‌లో దిగి కార్మికుడు మృతి... మరో ఇద్దరి పరిస్థితి విషమం