GHMC Proactive Measures to Prevent Dog Attacks :గత కొన్ని నెలలుగా హైదరాబాద్ నగరంలో వీధికుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. వీటి దాడులకు పలువురు మృతి చెందారు. కుక్కల దాడుల కారణంగా చిన్నారులు మృతి చెందటంపై తెలంగాణ హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా సంబంధింత అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించింది. దీంతో ఈ సమస్య నివారణకు జీహెచ్‌ఎంసీ 11 లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి అమలుకు శ్రీకారం చుట్టింది.
ప్రచారం :కుక్కల ప్రవర్తన గురించి, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి, శుకనాల దాడుల జాగ్రత్తలపై కాలనీ సంఘాలు, టౌస్ లెవసస్ ఫెడరేషన్లు ఎస్‌హెచ్‌జీలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు.
శిశువులకు రక్షణ : నిర్మాణంలోని భవనాల వద్ద శిశువులకు సంరక్షణ కేంద్రాలు తప్పనిసరి చేయనున్నారు.
వివరాల నమోదు : ఇప్పటి నుంచి పెంపుడు జంతువుల వివరాలు నమోదు చేయనున్నారు. దీంతో కుక్క కాటు ఘటనలు నియంత్రించవచ్చని యోచిస్తున్నారు.
కుక్కల దాడుల నియంత్రణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు - హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేయాలని సూచన - TG High Court Serious On Dogs Issue
డిజిటల్ మ్యాపింగ్ :నీటి తొట్టెలు, ఆహారం అందించే ప్రాంతాలు, జంతు సంరక్షణ కేంద్రాలు, ఎన్జీవోలు, మాంసం వ్యర్థాలను పడేసే ప్రాంతాలు, దుకాణాలు, నమోదు కేంద్రాలను జియో ట్యాగ్ చేసి డిజిటల్ మ్యాప్‌ను రూపొందించనున్నారు.
నోటీసులు :మాంసం, చేపల వ్యర్థాలు, జీవ వ్యర్థాలు, ఆహార వ్యర్థాలను ఖాళీ స్థలాలు, రహదారులపై పడేస్తున్న మాంసం దుకాణాలు, ఆసుపత్రులు హోటళ్లకు నోటీసులు జారీ చేసి, వారి వైఖరి మార్చుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచిస్తారు. వాటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. వ్యర్థాలను 100 శాతం సేకరించి డంపింగ్ యార్డుకు తరలించేలా చర్యలు చేపట్టనున్నారు. ఇవి చేపట్టడం వల్ల కుక్కల దాడులు తగ్గుతాయని జీహెచ్‌ఎంసీ అధికారులు యోచిస్తున్నారు.
జీహెచ్‌ఎంసీ దత్తత కార్యక్రమాలు
- వీధుల్లో కుక్కల కోసం నీటి తొట్టెలు ఏర్పాటు చేయడం
- కుక్కలను పట్టుకునే వాహనాల సేవలు 24 గంటలు అందుబాటులో ఉంచడం
- కుక్కలకు సంతానం కలగకుండా శస్త్రచికిత్సలు, రేబిస్ టీకాలు వేయడం
- మూసీ పరీవాహక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించడం
- పునరావాస కేంద్రాల నిర్మాణానికి స్థలాలను గుర్తించి వాటి నిర్మాణం చేపట్టడం
బతికున్న మనుషులను కుక్కలు పీక్కు తినడం దారుణం : హరీశ్‌రావు - Stray dog attacks in Telangana
డేంజర్ డాగ్స్ - పిక్కలు పీకుతున్న కుక్కలు - మొద్దు నిద్రలో అధికారులు - Stray Dog Attack Cases In Nalgonda