తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్‌ జిల్లాలో లక్షా 30 వేల ఓట్లు రద్దు - మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి

ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించిన జీహెచ్​ఎంసీ - రాజధానిలోని 15 స్థానాల్లో 46 లక్షల ఓటర్లు

GREATER HYDERABAD MUNICIPAL CORPORATION
GHMC VOTRES LIST (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

GHMC Voter List : తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ జిల్లాలోని ముసాయిదా ఓటరు జాబితాను మంగళవారం (అక్టోబర్ 29) జీహెచ్‌ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) ఎన్నికల విభాగం ప్రకటించింది. దాని ప్రకారం ఫిబ్రవరి 8, 2024 నాటి ఓటరు జాబితాతో పోలిస్తే జిల్లా వ్యాప్తంగా లక్షా 30 వేల మంది ఓట్లు రద్దయ్యాయి. ఒకరికి రెండు గుర్తింపు కార్డులు ఉండటం, ఇళ్లు ఖాళీ చేసి వెళ్లడం, చనిపోవటం, ఇతరత్రా కారణాలతో వాటిని జాబితా నుంచి తొలగించినట్టు జీహెచ్‌ఎంసీ అధికార యంత్రాంగం వెల్లడించింది.

చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో 27,789 మంది కొత్తగా ఓటరు జాబితాలో చేరగా, ముషీరాబాద్‌లో 17,937, యాకుత్‌పురలో 14,271, జూబ్లీహిల్స్‌లో 14,241, కార్వాన్‌లో 13,454, నాంపల్లిలో 12,041, బహదూర్‌పురలో 13,059, సికింద్రాబాద్‌లో 10,398, ఖైరతాబాద్‌లో 10,065, అంబర్‌పేటలో 9,688 మంది కొత్తగా ఓటరు జాబితాలో చేరారు. అత్యధికంగా చాంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గంలోని 22,002 ఓట్లు, ముషీరాబాద్‌లోని 15,940 ఓట్లు, జూబ్లీహిల్స్‌లోని 12,160 ఓట్లు, కార్వాన్‌లోని 12,081 మంది ఓట్లు రద్దయ్యాయి.

తుది జాబితా 2025లోనే: పెరిగిన ఓట్లు అధికంగా యాకుత్‌పురలో 2.49 శాతంగా నమోదయ్యాయి. పోలింగ్‌ కేంద్రాలు మొత్తంగా 3,984గా ఉన్నాయి. ముసాయిదాపై నవంబరు 28, 2024 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులను స్వీకరిస్తామని జీహెచ్​ఎంసీ వెల్లడించింది. వాటిని పరిష్కరించిన అనంతరం జనవరి 6, 2025న తుది ఓటరు జాబితాను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.

ఓటరు జాబితా కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

కొత్తగా జాబితాలో చేరినవి : 1,81,879

రద్దయిన ఓట్లు : 1,29,884

మొత్తంగా పెరిగిన ఓట్లు : 51,995

నియోజకవర్గాల వారీగా హైదరాబాద్ జిల్లా ఓటర్లు

  • ముషీరాబాద్ - 3,08,378
  • మలక్​పేట్ - 3,19,556
  • అంబర్​పేట్ - 2,80,451
  • ఖైరతాబాద్ - 3,01,160
  • జూబ్లీహిల్స్ - 3,89,287
  • సనత్​నగర్ - 2,54,165
  • నాంపల్లి - 3,29,839
  • కార్వాన్ - 3,64,390
  • గోషామహల్ - 2,76,628
  • చార్మినార్ - 2,32,004
  • చాంద్రాయణగుట్ట-3,53,401
  • యాఖుత్​పుర - 3,64,855
  • బహదూర్​పుర - 3,25,241
  • సికింద్రాబాద్ - 2,67,933
  • కంటోన్మెంట్ 2,54,845

గతంలో జరిగిన జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో బీఆర్​ఎస్- 55, బీజేపీ- 48, ఎమ్​ఐఎమ్- 44 , కాంగ్రెస్- 2, ఇతరులు-1 చొప్పున కార్పొరేటర్ సీట్లను గెలుచుకున్నాయి. మొత్తం 150 సీట్లకు ఎన్నికలు నిర్వహించారు.

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో 47 స్థానాల్లో భాజపా గెలుపు

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం మాదే : బండి సంజయ్​

ABOUT THE AUTHOR

...view details