Not Allowing Ganesh Immersion in Hussain Sagar : భాగ్యనగరంలో ఏటా వినాయక నిమజ్జన కోలాహలం అంగరంగ వైభవంగా జరుగుతుంది. నగర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హుస్సేన్ సాగర్‌కు శోభయాత్రగా తరలివచ్చి తమ బొజ్జ గణపయ్యను నిమజ్జనం చేస్తారు. అయితే ఈ ఏడాది హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనాలపై నగర పోలీసులు, జీహెచ్ఎంసీ ఆంక్షలు విధించింది. హైకోర్టు ఆదేశాల మేరకు హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనాలకు అనుమతి లేదని విజ్ఞప్తి చేస్తూ ట్యాంక్‌బండ్ పై ప్రత్యేకంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది.
హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనాలపై ఆంక్షలు: ట్రాఫిక్ పోలీసు భారికేడ్లతో పాటు ట్యాంక్‌బండ్‌పై ఉన్న గ్రిల్స్‌కు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అలాగే గ్రిల్స్‌కు అదనంగా ట్యాంక్‌బండ్ పొడవునా భారీ ఇనుప కంచెలను ఏర్పాటు చేసి భక్తులెవరూ సాగర్‌లో వినాయక విగ్రహాలు వేయకుండా పకడ్బందీగా బిగించారు. వాటిపై ప్రతి వంద మీటర్లకు ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసి భక్తులెవరూ పీవోపీ విగ్రహాలను సాగర్‌లో నిమజ్జనం చేయవద్దని సూచించారు.
భారీ క్రేన్లు ఏర్పాటు: మరోవైపు ఎన్టీఆర్ మార్గ్, పీవీ మార్గ్ వైపున భారీ క్రేన్లను ఏర్పాటు చేసి రెండు రోజుల నుంచి నిమజ్జన ప్రక్రియను కొనసాగిస్తున్నారు. నగరంలోని చాలా ప్రాంతాల నుంచి భక్తులు పీవోపీ, మట్టి విగ్రహాలను తీసుకొచ్చి పీవీ మార్గ్‌లోని క్రేన్ల సహాయంతో నిమజ్జనం చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడ జోరుగా నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది. ఇదే విషయంపై హైకోర్టు కూడా గతంలో ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్‌లో ఈనెల 10 నుంచి గణేశ్ నిమజ్జనాలు - ఆ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు