How to Check Ghee Quality in Telugu:పవిత్రమైన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పడు ప్రతి ఒక్కరిలోనూ ఒక సందేహం కలుగుతుంది. బయట దుకాణాల్లో కొనే నెయ్యి మంచిదా కాదా అని. అయితే నెయ్యి స్వచ్ఛతను ఎలా తెలుసుకోవాలా చాలా మందికి తెలియదు. రోజుకి రెండుమూడు స్పూన్లు నెయ్యి తింటే రోగనిరోధకశక్తి పెరుగుతుందనీ, పిల్లలకీ వృద్ధులకీ నెయ్యి మంచిదనీ, నేతితో వండిన అన్నం పిల్లలకు మేలనీ అంటారు. మరి ఇన్ని ప్రయోజనాలున్న ఈ నెయ్యి స్వచ్ఛమైందో కాదో తెలుసుకునేదెలా. ఇప్పడు మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Ghee Purity Test At Home:దేశీ నెయ్యిలో పోషకాలతోపాటు యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలూ చాలా ఉంటాయి. దీని వల్ల రుచితో పాటు ఆరోగ్యమూ ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలున్న ఈ నెయ్యి స్వచ్ఛమైందో కాదో తెలుసుకునేదెలా అంటే..
- నీళ్లతో పరీక్ష:గ్లాసు నీటిలో చెంచా నెయ్యి వేయండి. నెయ్యి నీళ్లపై తేలితే అది స్వచ్ఛమైంది. అదే అడుగుకు చేరితే కల్తీ అని నిర్ధారణ చేసుకోవచ్చు.
- వేడి చేయడం:పాన్‌లో రెండు మూడు చెంచాల నెయ్యి వేసి కొంచెెం సేపు వేడి చేయాలి. ఆ తర్వాత ఓ రోజంతా దాన్ని అలా వదిలేయాలి. తరువాత రోజు అది చిన్న చిన్న రేణువుల్లా మారి సువాసనలు వెదజల్లుతుంటే స్వచ్ఛమైందేనని ముద్దలానే ఉంటే కల్తీ అని తెలుసుకోవచ్చు.
- ఉప్పుతో:2 చెంచాల నెయ్యిలో అర చెంచా ఉప్పు వేసి ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఆ తర్వాత నెయ్యి రంగు మారితే అది కల్తీ అనే అర్థం.
ఇలా కూడా కనిపెట్టొచ్చు..
- కాస్త నెయ్యిని అరచేతిలో వేసుకోండి. కాసేపటికి అది కరిగితే నాణ్యమైందని అర్థం.
- చెంచా నెయ్యిని పాన్‌లో వేసి వేడి చేయాలి. వెంటనే కరిగి ముదురు చాక్లెట్ రంగులోకి మారితే అది స్వచ్ఛమైంది. కరగడానికి ఎక్కువ సమయం పట్టి, లేత పసుపు రంగులోకి మారితే మాత్రం తేడా ఉన్నట్టు.