Fuel Tanker Catches Fire at Ek Minar Petrol Bunk :హైదరాబాద్ నాంపల్లి ఏక్‌మీనార్ కూడలిలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. హెచ్‌పీ బంక్‌లో హిందుస్థాన్ పెట్రోలియం ట్యాంకర్ పెట్రోల్ నింపడానికి బంకు వద్దకు వచ్చింది. పెట్రోల్ బంక్ లోపలికి వెళ్లాక, అందులోని పెట్రోల్‌ను అన్‌లోడ్ చేయాలి అందుకు ట్యాంక్‌పై ఉన్న లిడ్ తెరుచుకునే క్రమంలో మంటలు చెలరేగాయి.
జీడిమెట్ల పాలిథిన్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం - మంటల ధాటికి కూలిన భవనం - రూ.100 కోట్ల నష్టం!
చాకచక్యంగా వ్యవహరించి : సమయానికి అక్కడ ఉన్నవారు, ట్యాంక్ డ్రైవర్, స్థానికులు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే అటుగా వెళ్తున్న గోశామహల్ ట్రాఫిక్ ఏసీపీ ధనలక్ష్మి చాకచక్యంగా వ్యవహరించి పెట్రోల్ బంక్‌లోకి వెళ్లకుండా ట్యాంకర్‌ను నిలువరించి బయటకు తీసుకువచ్చారు.
"నేను గోషామహల్ వెళ్తున్న క్రమంలో పెట్రోల్ ట్యాంకర్ నుంచి మంటలు చెలరేగటం చూశాను. ఆ మంటలు బంక్‌కు వ్యాప్తి చెందితే చాలా ప్రమాదం జరుగుతుంది. అలా కాకుండా ట్యాంకర్‌ను బయటకు రప్పించాను. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాను. వారు వచ్చి మంటలు అదుపు చేశారు." - ధనలక్ష్మి, గోశామహల్ ట్రాఫిక్ ఏసీపీ