Free MBBS Seat in Govt Medical Colleges :ప్రస్తుతం హవా అంతా ఇంజినీర్లు, డాక్టర్లదే. ప్రతి ఫ్యామిలీకో ఇంజినీర్ తప్పక ఉంటున్నారు. కానీ డాక్టర్లే చాలా తక్కువ. అయితే కుటుంబంలో ఒక్కరైనా డాక్టర్ చదివితే బాగుండని చాలా మంది భావిస్తారు. కానీ ఎంబీబీఎస్ సీటు సాధించడం అంత ఈజీ కాదు. కష్టపడి చదివి సీటు దక్కించుకున్నా లక్షల రూపాయలు ఖర్చు చేసే స్తోమత చాలా మందికి ఉండదు. అందుకే వైద్య వృత్తిపై ఎంత మమకారం ఉన్నా చాలా మంది ఆ ఆశను, ఆశయాన్ని మనసులోనే చంపేసుకుంటుంటారు.
డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నారా? - ఈ కాలేజీల్లో సీటు ఫ్రీ
తెలంగాణ ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలలు - చిగురించిన పేద విద్యార్థుల ఆశలు
Published : Nov 6, 2024, 12:11 PM IST
|Updated : Nov 6, 2024, 2:18 PM IST
అయితే తెలంగాణలోని పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఇక నుంచి వైద్య విద్య తలకు మించిన భారంగా మారదు. ఎందుకంటే రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలు వస్తున్నాయి. వీటి రాకతో పేద విద్యార్థుల్లో వైద్య విద్య చదవాలన్న ఆశలు చిగురిస్తున్నాయి. ఫ్రీ సీటు సాధించిన విద్యార్థులు ప్రస్తుతం ఈ కళాశాలల్లో చదువుతూ ఫ్యూచర్ డాక్టర్లుగా రూపుదిద్దుకుంటున్నారు. మరి ఆ విద్యార్థుల భవిష్యత్ లక్ష్యాలంటే వారి మనసులోని మాటేంటో వారి మాటల్లోనే విందాం.