తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫ్రీ గ్యాస్​ సిలిండర్ల పంపిణీకి వేళాయే - బుకింగ్స్​​లో ప్రాబ్లమ్స్​ ఉంటే వెంటనే ఇలా చేయండి

3 ఉచిత గ్యాస్​ సిలిండర్ల పథకానికి తెల్లరేషన్​ కార్డుదారులందరూ అర్హులే - సిలిండర్​ ఇంటికి డెలీవరీ అయిన 48 గంటల్లో అకౌంట్లలో నగదు జమ

Free Gas Cylinder Scheme in AP
Free Gas Cylinder Scheme in AP (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

Free Gas Cylinder Scheme in AP :ఏపీలో కూటమి ప్రభుత్వం దీపావళి ధమాకా ప్రకటించింది. సూపర్‌-6లో మరో ముఖ్యమైన పథకానికి పచ్చజెండా ఊపింది. మహిళలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పంపిణీకి ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెల్ల రేషన్‌ కార్డు ఉన్న వారందరూ ఉచిత సిలిండర్‌కు అర్హులని పేర్కొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం శ్రీకాకుళంలో ఉచిత సిలిండర్ల పథకానికి శ్రీకారం చుడతారు. అదే రోజు జిల్లాలోని గుడిపాలలో రవాణా శాఖ, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి రామ్‌ ప్రసాద్‌ రెడ్డితో ఉచిత సిలిండర్ల పంపిణీ చేసి పథకాన్ని ప్రారంభిస్తారు.

వ్యక్తిగత బ్యాంకు ఖాతాకు నగదు జమ :లబ్ధిదారులు ఇప్పటి మాదిరిగానే గ్యాస్‌ సిలిండర్లు నగదును చెల్లించి పొందాలి. సిలిండర్‌ ఇంటికి డెలివరీ అయిన 48 గంటల్లో (రెండు రోజుల్లో) ప్రత్యక్ష నగదు బదిలీ (డైరెక్ట్​ బెన్​ఫిట్​ ట్రాన్స్​ఫర్​) విధానంలో వ్యక్తిగత బ్యాంకు అకౌంట్​నకు నగదును జమ చేస్తారు. ప్రతి నాలుగు నెలల్లో ఒక గ్యాస్​ సిలిండర్‌ను ఎప్పుడైనా ఉచితంగా పొందే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం కల్పిస్తోంది. బుకింగ్, డెలివరీ, నగదు జమ తదితర సాంకేతిక సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక టోల్‌ ఫ్రీ నంబరుతో పాటు జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో ప్రత్యేక కాల్‌ సెంటర్‌కు, గ్రామ స్థాయిలో సచివాలయాల్లో తెలియజేస్తే వెంటనే పరిష్కరిస్తారని అధికారులు తెలిపారు.

వేగంగా నమోదు :ఉచిత సిలిండర్‌ పొందేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో వినియోగదారులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ పథకానికి అర్హులైన వారి సెల్​ఫోన్​లకు సైతం సంక్షిప్త సమాచారం అందింది. తొలి విడత సిలిండర్ నవంబరు 1 నుంచి మార్చి 31వ తేదీ వరకు పొందవచ్చు.

" ఏపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులందరికీ ఈ పథకాన్ని ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా అమలు చేస్తాము. తెల్లరేషన్‌ కార్డు కలిగిన లబ్దిదారులందరికీ ఉచిత సిలిండర్‌ అందజేస్తాం.- శంకరన్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి

'ఉచిత గ్యాస్​ సిలిండరు కావాలంటే మార్చి 31లోపు బుక్​ చేసుకోవచ్చు'

గుడ్ న్యూస్ - దీపావళి నుంచి ఫ్రీగా మూడు గ్యాస్ సిలిండర్లు

ABOUT THE AUTHOR

...view details