Free Current Guidelines in Telangana :తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఎన్నికలకు ముందు ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ లిమిట్ రూ. 10 లక్షలకు పెంపు అనే రెండు గ్యారంటీలు అమలులోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు ప్రతి నెలా 200 యూనిట్ల గృహావసర కరెంటు ఉచితంగా సరఫరా చేస్తామన్న గ్యారంటీ హామీ అమలుకు కసరత్తు ముమ్మరం చేసింది. అందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించే పనిలో పడింది. అందరికీ ప్రతి నెలా ఫ్రీ కరెంట్ హామీ వర్తిస్తుందా? లబ్ధిదారులను ఎలా గుర్తిస్తారు? వంటి సందేహాలు జనాల్లో నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ కరెంట్ అమలుకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. వారికి మాత్రమే ఉచిత కరెంట్(Free Current Scheme) అంటూ కొన్ని షరతులు పెట్టింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
రాష్ట్రంలో ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేసిన రేవంత్ సర్కార్.. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఈ క్రమంలో ఫ్రీ కరెంట్ రాష్ట్రంలోని అర్హులైన వారందరికీ అందేలా చూస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మొదటగా రాష్ట్రంలో తెల్ల రేషన్‌కార్డులున్న వారికి 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి కూడా ప్రస్తుతం తెల్లరేషన్ కార్డులు ఉన్నవారికి మాత్రమే ఈ స్కీమ్‌ను వర్తింపజేస్తామని పేర్కొన్నారు. అర్హులైనా రేషన్ కార్డు లేని పక్షంలో వారికి రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు. అప్పుడు వాళ్లు కూడా గృహ జ్యోతి పథకానికి అప్లై చేసుకోవచ్చని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. అర్హులైన వారందరికీ ఈ స్కీమ్ అందుతుందని ఎవరూ ఎలాంటి ఆందోళన చెందొద్దని సూచించారు.
ఆరు గ్యారంటీలకే బడ్జెట్‌లో పెద్దపీట - మొత్తం ఎన్ని నిధులు కేటాయించారో తెలుసా?