Former Vice President Venkaiah Naidu Honors Seven Friends in Visakha :50 ఏళ్లుగా తనతో స్నేహం కొనసాగిస్తున్న ఏడుగురు స్నేహితులు 70వ ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా వారిని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విశాఖలో సత్కరించారు. 1972-73 ఏడాది ఏర్పడిన స్నేహానుబంధం ఇప్పటికీ కొనసాగుతున్నందుకు గుర్తుగా వెంకయ్యనాయుడు దంపతులు సప్తతి పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏడుగురు మిత్రుల దంపతులను ఘనంగా సన్మానించారు.
ఏడుగురు మిత్రులను సన్మానించిన వెంకయ్య నాయుడు- అదిరిపోయే ఫ్లాష్ బ్యాక్ - Venkaiah Naidu Honors Seven Friends - VENKAIAH NAIDU HONORS SEVEN FRIENDS
Venkaiah Naidu Honors Seven Friends in Visakha : ఎటువంటి హద్దులు లేని స్నేహం జీవితాంతం గుర్తు ఉంటుంది. అలాంటి స్నేహితులు 70 ఏళ్లు దాటిన అనంతరం ఓ చోట కలుసుకున్న అపూర్వ ఘటం విశాఖలో జరిగింది. తన ఏడుగురు మిత్రులకు 70 ఏళ్లు నిండిన సందర్భంగా మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సత్కారం చేశారు.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 24, 2024, 12:28 PM IST
ఇందులో మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు, అట్లూరి అశోక్, తుమ్మల రంగారావు, వీరమాచినేని రంగప్రసాద్, త్రిపురనేని జేజీప్రసాద్, బిక్కిన లక్ష్మణరావు, సూర్యదేవర జోగేంద్రదేవ్ ఉన్నారు. కేవలం కుటుంబసభ్యులు, మిత్రుల మధ్యే సాగిన ఈ కార్యక్రమంలో అందరూ తమ మధ్య ఉన్న అనుబంధాలను నెమరువేసుకున్నారు. ఈ వేడుకకు అనుకోని అతిథిగా సూపర్‌స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. రాడిసన్‌బ్లూలో దిగిన రజనీకాంత్ అదే హోటల్‌లో వెంకయ్యనాయుడు ఉన్నారని తెలిసి ఆయన వద్దకు వచ్చారు. స్నేహితులతో కలిసి భోజనం చేస్తున్న వెంకయ్యనాయుడుని అభినందించి వెళ్లారు.