Harish Rao Made Key Comments On Budget: బడ్జెట్‌పై శాసనసభలో సాధారణ చర్చ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్‌పై చర్చను ప్రారంభించిన ఆయన బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన బాగాలేదని మాటలు చెబితే సరిపోతుందా? అని ప్రశ్నించారు. రూ.4.5 లక్షల లేని జీఎస్‌డీపీని బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.14 లక్షలకు తీసుకెళ్లిందన్నారు. రామగుండం నుంచి 1400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వ పాలన బాగాలేదని ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 వందల పింఛన్ ఇస్తే బీఆర్ఎస్ పాలనలో రూ.2వేలకు పెంచినట్లు హరీశ్‌రావు తెలిపారు. అధికారంలోకి రాకముందు నాలుగు వేల రూపాయల పింఛన్ ఇస్తామన్నారని గుర్తు చేశారు. అయితే, 4 వేల పింఛన్ నాలుక మీదనే ఉందని ఎద్దేవా చేశారు. పల్లెల అభివృద్ధి స్వచ్ఛతపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ర్యాంక్‌ల్లో టాప్ 20లో 14 తెలంగాణకు వచ్చాయని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ పనితీరు తెలియకూడదని పదేళ్ల ప్రభుత్వం సమాచారాన్ని తొలగించారని మండిపడ్డారు. రాష్ట్ర బడ్జెట్ అవాస్తవాలతో కూడిన బడ్జెట్ అని హరీశ్‌రావు విమర్శించారు. ట్యాక్స్ ద్వారా రెవెన్యూ ఎక్కువ వస్తుందని బడ్జెట్‌లో పెట్టారని ఆరోపించారు. ఎలా వస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు విధానాల రూపకల్పన కంటే బీఆర్ఎస్ నేతలను తిట్టడంపైనే ఎక్కువ దృష్టిపెట్టారని హరీశ్‌రావు ఆరోపించారు.