Former IAS PV Ramesh Kumar: ఏపీ లో బడ్జెట్ కేటాయింపులు అస్తవ్యస్తం గా ఉన్నాయని ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి పీవీ రమేష్ తెలిపారు. ప్రజల సొమ్ముకు వ్యక్తుల పేర్లు పెట్టుకోవడం ఏమిటని ప్రశ్నించారు. మొత్తం 74 వేల కోట్ల ఆదాయంలో మద్యం విక్రయాల ద్వారా నే 22 వేల కోట్లు వస్తోందని వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం మళ్ళీ మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వమే తీసుకుంటోందని పేర్కొన్నారు. 2.56 లక్షల కోట్ల బడ్జెట్ లో అప్పుల దే అగ్రస్థానమన్నారు. రిజర్వు బ్యాంకు ద్వారా తీసుకున్న అప్పులే 5.5 లక్షల కోట్లు దాటాయని తెలిపారు. ఇక ప్రభుత్వ కార్పొరేషన్ ల నుంచి అప్పులు తీసుకోవడం లో ఇతర రాష్ట్రాలకు ఏపీ ఒక మోడల్ గా మారిపోయిందని విమర్శించారు. వచ్చే ఆదాయం కూడా తాకట్టు పెట్టేసి అప్పు తీసుకున్న పరిస్థితి ఉందని పీవీ రమేష్ ఆక్షేపించారు.
ఏపీ ప్రభుత్వం బెవరేజేస్ కార్పొరేషన్ ద్వారా 30 వేల కోట్లు తీసుకుందని పీవీ రమేష్ గుర్తు చేశారు. నాన్ కన్వర్ట్ బుల్ దిబెంచర్లు ద్వారా 14 వేల కోట్లు అప్పు తీసుకున్నారని తెలిపారు. ప్రభుత్వ గ్యారెంటీ, ఆఫ్ బడ్జెట్ బరోవింగ్స్, ప్రభుత్వమే షెల్ కంపెనీల పెట్టీ తీసుకున్న అప్పులు అని ఎద్దేవా చేసారు. అన్ని అప్పులు కలిపితే ఇప్పుడు ఏపీ జీడీపీ తో సమానం గా ఉందన్నారు. గతం లో చంద్రబాబు రుణామాఫీ అంటే 80 వేల కోట్ల మేర అంచనా వేశామని దానికి ఒక్క పైసా ఇవ్వమని రిజర్వు బ్యాంకు గవర్నర్ చెప్పారని వెల్లడించారు. ఎస్బీఐ అయితే ఏపీ కి రుణం ఇవ్వొద్దని రాతపూర్వక గా హెచ్చరించిందన్నారు. అప్పుడు కూడా బటన్ నొక్కొచ్చు, ఆస్తులు అమ్మేయ వచ్చు కానీ అలా చేయకుండా చాలా కసరత్తు చేసి రైతులను ఆడుకునే ప్రయత్నం చేశామని తెలిపారు. బటన్ నొక్కితే ఏమైనా చేయొచ్చు అనుకుంటే ఎలా అది ఊహాత్మక ప్రపంచం దాని నుంచి రాజకీయ ఆలోచనలు బయట పడాలని పీవీ రమేష్ హితవు పలికారు.
ఏపీలో ఆర్థికశాఖ మంత్రి లేరు - కేవలం అప్పుల శాఖ మంత్రే ఉన్నారు : భానుప్రకాష్ రెడ్డి - Bhanu Prakash Reddy fire on jagan