Foreigner Caught with Cash During Police Check : ఎన్నికలు సమీపిస్తున్న వేళ నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, మద్యం ఇతరత్రా అక్రమ రవాణాపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో జిల్లాల సరిహద్దుల్లో తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో లక్షా 30 వేల రూపాయల నగదును ఓ విదేశీయుడి బ్యాగ్‌లో పోలీసులు గుర్తించారు. అయితే ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న సంధ్య ఆక్వా పరిశ్రమకు అతడు వచ్చినట్లు సమాచారం.
తిరుగు ప్రయాణంలో అతడిని యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ ప్రధాన కూడలి వద్ద పోలీసులు పట్టుకున్నారు. దీంతో విషయం తెలుసుకున్న సంధ్య ఆక్వా పరిశ్రమ ప్రతినిధులు ఉప్పాడకు చేరుకుని పోలీసు అధికారులతో మాట్లాడి విదేశీయుడిని పంపించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అతడు వియత్నాం దేశానికి చెందిన టాంగ్గా పోలీసులు గుర్తించారు. అయితే నగదును సీజ్ చేసి ఎన్నికల కమిషనర్‌కు పంపుతున్నట్లు ఫ్లైయింగ్ స్క్వాడ్ నారాయణ దాసు తెలిపారు. కాగాడ్రగ్స్కేసులో ఇరుక్కున్న పరిశ్రమకు విదేశీయుడు రావడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Police Checks on Sandhya Aqua Industry Bus: విశాఖ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడిన వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరుగుతున్న వేళ సంధ్య ఆక్వాకు చెందిన బస్సు ఒకటి కొత్త మూలపేట ఎస్సీజెడ్ కాలనీలో కనిపించడం కలకలం రేపింది. నాలుగు రోజులుగా అక్కడే సంధ్య ఆక్వా పరిశ్రమకు చెందిన బస్సు ఉండటంతో స్థానికులు ఆందోళన చెందారు.