ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గురుకులంలో 100మంది విద్యార్థులకు అస్వస్థత - ఆరోగ్య పరిస్థితిపై మంత్రుల ఆరా - FOOD POISON FOR STUDENTS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 15, 2024, 12:14 PM IST

Food Poison for Students in Ambedkar Gurukulam in Naidupet : తిరుపతి జిల్లా నాయుడుపేట అంబేద్కర్ గురుకుల పాఠశాలలో దాదాపు 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటనపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి విచారం వ్యక్తం చేశారు.

food_poison
food_poison (ETV Bharat)

Food Poison for Students in Ambedkar Gurukulam in Naidupet :తిరుపతి జిల్లా నాయుడుపేటలోని అంబేడ్కర్‌ గురుకులంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 100 మంది విద్యార్థులకు వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెండు రోజుల కిందట వండిన ఆహార పదార్థాలను ఆదివారం మధ్యాహ్నం భోజనంలో వండించడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని తోటి విద్యార్థులు పేర్కొన్నారు.

Naidupet Tirupati District :అస్వస్థతకు గురైన విద్యార్థులను గురుకుల సిబ్బంది హుటాహుటిన నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి కలుషిత ఆహారం తినడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు వెల్లడించారు. ఇందులో 50 మంది పిల్లలు తీవ్ర, మరో 50 మంది స్వల్ప అనారోగ్యం పాలయ్యారు. కొంత మంది విద్యార్థులను మెరుగైన చికిత్స నిమిత్తం గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్ మున్సిపల్​ కమిషనర్​, తహసీల్దార్, స్పందించారు.

యోగి వేమన యూనివర్సిటీలో ఫుడ్‌ పాయిజన్‌ - 50 మంది విద్యార్థినులకు అస్వస్థత

మంత్రి స్పందన : గురుకుల విద్యార్థుల అస్వస్థతపై ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్పందించారు. అక్కడి వైద్య అధికారులతో మాట్లాడి వైద్యం అందుతున్న వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు వారికి అందుతున్న వైద్యసేవలు తెలియచేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. అనంతరం కలెక్టర్ వెంకటేష్, జిల్లా వైద్యాధికారి శ్రీహరిలతో వివరాలు తెలుసుకుని ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్​కు వివరించారు.

అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించిన ఎస్టీ కమిషన్ సభ్యుడు

విద్యార్థులు అస్వస్థతపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి విచారం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా కలెక్టర్​తో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. ఇవాళ నియోజకవర్గంలోని పర్యటనలు వాయిదా వేసుకొని హుటాహుటిన నాయుడుపేటకు బయలుదేరారు.

పాఠశాలలోని అల్పాహారంలో బల్లి - అస్వస్థతకు గురైన విద్యార్థులు

ABOUT THE AUTHOR

...view details